ఖమ్మం జిల్లాలో మరో ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీకి నిర్ణయం తీసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజరన్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం వ్యవసాయ, ఉద్యానవన ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఖమ్మం జిల్లాలో మరో ఆయిల్ ఫెడ్ పరిశ్రమ పెట్టబోతున్నట్టు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగులో నాణ్యత పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని కూడా మంత్రి నిరంజన్‌రెడ్డి నిర్ణయించారు. అలాగే బీచుపల్లి ఫ్యాక్టరీని కూడా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఆయిల్‌ఫెడ్ సంస్థ ద్వారా మరో రెండు పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట, మహబూబాబాద్‌లో ఈ ఆయిల్ ఫ్యాక్టరీలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మార్కెటింగ్, సహకార శాఖలు, అనుబంధ శాఖలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. లాభసాటి ఉపాధి రంగం దిశగా వ్యవసాయం రంగాన్ని తీర్చి దిద్దుతున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
పంటల వైవిధ్యంపై మరిన్ని పరిశోధనలు జరగాలంటున్న మంత్రి నిరంజన్ రెడ్డి.. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని వివరించారు. అందుకే ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించామని మంత్రి తెలిపారు. మౌలిక వసతుల కల్పన, పరిశోధనకు ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మొత్తానికి తెలంగాణ వ్యవసాయ రంగంలో కొత్త పోకడలకు సిద్ధం అవుతోంది. వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. కాకపోతే.. మార్కెట్‌కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుంటేనే భవిష్యత్ బావుంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి