తెలుగుదేశంపార్టీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అర్ధమైపోతోంది. ఇందుకు తాజాగా బదిలి అయిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విషయమే ఉదాహరణగా తీసుకోవచ్చు. దాదాపు రెండున్నరేళ్ళు సవాంగ్ డీజీపీగా పనిచేశారు. మంగళవారం సవాంగ్ ను ప్రభుత్వం బదిలీచేసింది. ఈయన్ను జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. ఇక అక్కడి నుండి టీడీపీ నేతలు గోల గోల మొదలుపెట్టేశారు.





సవాంగ్ ను వాడుకుని వదిలేశారంటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగులు, టీచర్ల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందనే కోపం, వైజాగ్ లో 2 లక్షల కిలోల గంజాయిని దగ్ధం చేశారనే కోపంతోనే సవాంగ్ ను ప్రభుత్వం అకాస్మత్తుగా బదిలి చేసిందంటు మీడియా సమావేశాల్లో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సవాంగ్ పై చంద్రబాబునాయుడు అండ్ కో ఎంతగా ఆరోపణలు చేసింది అందరు చూసిందే. వీళ్ళకు ఎల్లోమీడియా బాగా వంతపాడుతోంది. చంద్రబాబునాయుడు హయాంలో ఉన్నతాధికారులు బదిలీ అయినపుడు ప్రభుత్వంలో పట్టుకోసమే అని అచ్చేసింది. ఇపుడు మాత్రం వేటంటు పిచ్చి రాతలు రాస్తోంది.






వైసీపీ జెండా కప్పుకుని సవాంగ్ పనిచేస్తున్నారని, ఐపీఎస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరిపోవాలంటు సవాంగ్ చంద్రబాబు అండ్ కో ఎన్నోసార్లు సలహాలిచ్చారు. ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయారంటు సవాంగ్ ను ఎన్నోసార్లు తిట్టిన తిట్టుకుండా తిట్టారు. సవాంగ్ కు వ్యతిరేకంగా అప్పట్లో ఇంతగోల చేసిన టీడీపీ నేతలు ఇపుడేమో సవాంగ్ బదిలీపై జగన్ను తప్పుపడుతున్నారు. అంటే జగన్ ఏమి చేసినా తప్పే ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా తయారైంది టీడీపీ, ఎల్లోమీడియా వ్యవహారం. అయినదానికి కాని దానికి నానా రచ్చ చేస్తోంది కాబట్టే జనాల్లో టీడీపీ చీపైపోతోంది.






ఉన్నతాధికారులు, అధికారుల బదిలీ అనేది ప్రభుత్వంలో సాధారణ వ్యవహారం. గతంలో చంద్రబాబునాయుడు కూడా ఎంతోమందిని బదిలీలు చేశారు. ప్రతిపక్షాలు తమకు నచ్చని అధికారుల మీద ఎన్నో ఆరోపణలు చేస్తాయి. అలాంటపుడు సదరు అధికారులు బదిలీ అయినపుడు సంతోషం వ్యక్తంచేయకపోయినా మౌనంగా ఉండిపోతాయి. కానీ ఇపుడు టీడీపీ మాత్రం చాలా విచిత్రంగా వ్యవహరిస్తోంది. సవాంగ్ ను డీజీపీగా కంటిన్యు చేసినా జగన్ పై ఆరోపణలు-విమర్శలే, బదిలీ చేసినా ఆరోపణలు, విమర్శలే చేస్తున్నది. టీడీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. సవాంగ్ బదిలీపై జగన్ జనాలకు సమాధానాలు చెప్పాలని పవన్ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: