ఇప్పుడు టీడీపీలో ఉన్న కొందరు నేతలు గాని వైసీపీలో ఉండుంటే..మంచి పొజిషన్‌లో ఉండేవారని చెప్పొచ్చు..ఏదో అధికారం కోసం ఆశతో పార్టీ మారకుండా ఉంటే ఇప్పుడు మంత్రులు కూడా అయ్యేవారు. కానీ ఆశతో పార్టీ మారి రాజకీయ జీవితంపై ఆశలు లేకుండా చేసుకున్నారు...అలా రాజకీయంగా ఇబ్బంది పడుతున్న వారిలో కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పనలు ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు.

వీరు 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన నాయకులు..జలీల్ ఖాన్ వైసీపీ నుంచి పోటీ చేసి విజయవాడ వెస్ట్‌లో విజయం సాధించారు. అటు ఉప్పులేటి కల్పన సైతం పామర్రు బరిలో విజయం సాధించారు...ఇలా ఇద్దరు వైసీపీ నుంచే గెలిచారు..కాకపోతే వైసీపీ ప్రతిపక్షంలోకి రావడంతో మనసు మారిపోయింది. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉన్నారు...కానీ తర్వాత టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌తో జలీల్, కల్పనలు మనసులు మారాయి...దీంతో వారు అధికారం కోసం ఆశపడి వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు.

అయితే జలీల్ మంత్రి పదవి వస్తుందనే ఆశతో టీడీపీలోకి వచ్చారు...కానీ చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. సరే ఉన్నన్ని రోజులు కాస్త అధికారాన్ని అనుభవించిన ఈ ఇద్దరు నేతలకు 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది...పామర్రులో టీడీపీ నుంచి పోటీ చేసి కల్పన ఓడిపోయారు..అటు విజయవాడ వెస్ట్‌లో జలీల్ బరిలో దిగకుండా తన కుమార్తెని పోటీకి దించారు. అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. అలా ఇద్దరికి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది..అదే పెద్ద దెబ్బ అనుకుంటే ఆ తర్వాత చంద్రబాబు, వీరికి ఉన్న సీట్లు కూడా పీకేశారు.

జలీల్‌కు విజయవాడ వెస్ట్ సీటు లేదు..ఇటు కల్పనకు పామర్రు సీటు లేదు..ఇలా ఇద్దరికి సీట్లు ఎగిరాయి. అలా అని వీరు వైసీపీలోకి వెళ్ళే పరిస్తితి లేదు. టీడీపీలో నెక్స్ట్ పోటీ చేసే ఛాన్స్ లేదు. మరి చివరికి టీడీపీలో వీరి పొజిషన్ ఏం అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: