కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు భారీగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలి వెళుతుంటారు. అయితే మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా అటు భక్తుల దర్శనం విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది టీటీడీ బోర్డు. సర్వదర్శనం టోకెన్ లను విడుదల చేయలేదు. కానీ ఇటీవలే భక్తులకు శుభవార్త చెబుతూ సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్ల పాటు తిరుపతి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నవారు ఇక ఇప్పుడు శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వెళ్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం తిరుమలకొండ భక్తుల తో నిండి పోయింది. నిన్న సర్వదర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో ఇక ప్రస్తుతం ఓకే ఎలాంటి టోకెన్లు లేకుండానే భక్తులను తిరుమలకు పంపిస్తూ ఉండటం గమనార్హం. భక్తులు పోటెత్తడంతో తిరుమల తిరుపతి ఆలయం లోని కంపార్ట్మెంట్లు అన్నీ కూడా నిండిపోయాయి. అనూహ్యంగా పెరిగిన రద్దీ తో స్వామివారి దర్శనానికి 20 నుంచి 30 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గదుల కేటాయింపు కార్యాలయాన్ని కూడా టీటీడీ అధికారులు మూసివేయడం గమనార్హం. తిరుమలలో భక్తుల రద్దీ చూసుకొని మిగతా భక్తులు తిరుమలకు రావాలి అంటూ టీటీడీ అధికారులు సూచించారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి