ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు బహుశా మొదటిసారి నిజం చెప్పినట్లున్నారు. ఇంతకీ చంద్రబాబు చెప్పిన నిజం ఏమిటంటే ‘జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నా రాజకీయజీవితంలో ఇంతవరకు చూడలేదు’ అని. మిగిలిన విషయాల్లో చంద్రబాబు మాటలు ఎలాగున్నా ఈ ప్రకటన మాత్రం ముమ్మాటికి నిజమనే చెప్పాలి. ఎందుకంటే 2009లో కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత జగన్ వైఎస్సార్సీపీ పెట్టుకున్నారు.





అప్పటినుండి చంద్రబాబుకు జగన్ కొరకరాని కొయ్యగా తయారైపోయారు. జగన్ను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నంలేదు. అయినా అన్నింటినీ తట్టుకుని నిబడ్డారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ మంచిపోటీ ఇచ్చి 67 సీట్లలో గెలిచింది. దాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఎంఎల్ఏలందరినీ ప్రలోభాలకు గురిచేసి లాగేసుకోవాలని ఎంతో ప్రయత్నించారు. చివరకు వీలుకాక 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలతో సరిపెట్టుకున్నారు.





చివరకు 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో అందరు చూసిందే. అక్కడినుండి టీడీపీని ప్రతివిషయంలోను జగన్ లేవకుండా కొడుతునే ఉన్నారు. ఎల్లోమీడియాతో ఎంత వ్యతిరేక ప్రచారం చేయించినా, కోర్టుల్లో ఎన్ని కేసులు వేయించినా జగన్ లెక్కేచేయటంలేదు. ఈ విషయంలోనే జగన్ అంటే చంద్రబాబుకు ఒళ్ళుమండిపోతోంది. వాస్తవం ఏమిటంటే  రాష్ట్ర విభజన వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు ఎలాంటి సమస్యా రాలేదు.





ఎందుకంటే కాంగ్రెస్ తరపున ఎవరు సీఎం అయినా చంద్రబాబు చెప్పినట్లు వినేవారు. కాబట్టి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు పెద్ద తేడా తెలీలేదు. అయితే 2019 ఎన్నికల్లో ఘోరఓటమితోనే  చంద్రబాబుకు సీరియల్ కష్టాలు మొదలయ్యాయి. దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో తెలీటంలేదు. అందుకనే జగన్ను ఉద్దేశించి చంద్రబాబు ఇలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని పదే పదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే. అందుకనే చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ విపరీతంగా పెరిగిపోయి జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: