అప్పుడెప్పుడో వచ్చిన అపరిచితుడు సినిమాలో హీరో క్యారెక్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చంగా చంద్రబాబునాయుడు క్యారెక్టర్ కూడా అలాగే అనిపిస్తోంది జనాలందరికీ. చంద్రబాబు నిజస్వరూపం అందరికీ తెలిసిందే కానీ ఆధారాల సహితంగా ఎవరికీ తెలీదు. ఎందుకంటే చంద్రబాబులోని అపరిచితుడు యాంగిల్ గురించి ఆధారాలతో ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టే.






అయితే తాజాగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (వైఎల్పీ) అనే హిందీ ప్రొఫెసర్ చంద్రబాబులోని అసలు యాంగిల్ ను బయటపెట్టారు. ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తీసేసి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టింది. దీనికి నిరసనగా యార్లగడ్డ అధికార భాషాసంఘం ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.  ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును జగన్మోహన్ రెడ్డి తీసేయటం తనకు నచ్చకే తాను పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అయితే జగనే తనకు హీరో అని కూడా అన్నారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే చంద్రబాబు, జగన్, వైఎస్సార్, ఎన్టీయార్ లాంటి ప్రముఖులకు యార్లగడ్డ అత్యంత సన్నిహితుడు. సో ఈ నేపధ్యంలోనే చంద్రబాబు గురించి కూడా యార్లగడ్డ చెప్పారు. జగన్ను హీరో అన్నందకు తనను జాతి ద్రోహి, కుల ద్రోహిగా చిత్రీకరిస్తారని చెప్పారు. అయినా తాను కొన్ని విషయాలు చెప్పక తప్పదన్నారు. ఇంతకీ ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే ఎన్టీయార్ కు చంద్రబాబు వల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా జరిగిందన్నారు. కొత్త రాజధానికి ఎన్టీయార్ పేరుపెట్టాలని తాను చంద్రబాబుకు సూచించినట్లు చెప్పారు.






అయితే చంద్రబాబు వెంటనే రాజగురువుతో మాట్లాడి అమరావతి అని పేరు ప్రకటించినట్లు చెప్పారు. అమరావతి అంటే దేవేంద్రుడి రాజధాని అని తన కుర్చీని ఎవరైనా లాగేసుకుంటారని భయపడితే వెంటనే వాళ్ళదగ్గరకు అమ్మాయిలను దేవేంద్రుడు పంపిస్తాడని అందరికీ తెలుసన్నారు. 1998లోనే ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని అప్పటి ప్రధాని వాజ్ పేయ అనుకున్నా చంద్రబాబే అడ్డుపడినట్లు చెప్పారు. ఈ విషయాన్ని వాజ్ పేయీనే తనకు చెప్పినట్లు కూడా యార్లగడ్డ వివరించారు.






ఎన్టీయార్ కొడుకు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినపుడు వైఎస్సారే కేసు లేకుండా చూసుకున్నట్లు చెప్పారు. ఇదే బాలయ్యకు బావయ్యుండి కూడా బాలకృష్ణను చూడటానికి కూడా రాలేదన్నారు. చివరకు ఆసుపత్రిలో ఉన్న బాలకృష్ణను చూడటానికి చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశం పెట్టుకున్నట్లు తెలిపారు. ఇవి చంద్రబాబు గురించి యార్లగడ్డ బయటపెట్టిన కొత్త యాంగిల్ .


 

మరింత సమాచారం తెలుసుకోండి: