వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 175కి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచితీరాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి మహాపట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే పార్టీ పటిష్టతకోసం అనేకరకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. బలహీనంగా ఉన్నారని అనిపించిన మంత్రులు,  ఎంఎల్ఏలను ఒకటికి పదిసార్లు పిలిపించి మాట్లాడుతున్నారు. అవసరమైతే క్లాసులు కూడా పీకుతున్నారు. గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టగా తీసుకుని జరిపిస్తున్నారు.





ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రతినెలా అన్నీ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారు. వైసీపీ గెలిచిన 151 నియోజకవర్గాల్లో రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుని రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఇవికాకుండా టీడీపీగెలిచిన 23 నియోజకవర్గాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టారట.  23 మంది ఎంఎల్ఏల్లో నలుగురు ఇపుడు టీడీపీతో లేరు. అయినా అన్నీ నియోజకర్గాలపైనా జగన్ దృష్టిపెట్టారు. టీడీపీ ఎంఎల్ఏల బలం ఏమిటి ? బలహీనత ఏమిటి ? అనే విషయాలతో పాటు అన్నీ నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతల్లో ఎవరు బలంగా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారనే విషయాలపై ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారట.




వాస్తవానికి మొన్నటిఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి  23 ఎంఎల్ఏలకు పరిమితమైంది. ఆ షాక్ నుండి కొంతకాలం తర్వాత తేరుకుని మళ్ళీ పోరాటాలు ప్రారంభించింది. పార్టీలోని సీనియర్ నేతలు చాలామంది ఓడిపోయినా మాజీల హోదాలోనే పోరాటాలు చేస్తున్నారు. పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉండటం వల్ల చాలా నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే కనిపిస్తోంది. సరిగ్గా ఈ పాయింట్ మీదే జగన్ దృష్టిపెట్టారు.






వచ్చే ఎన్నికల్లో  175 సీట్లు గెలవాలంటే కేవలం తమ నియోజకవర్గాల మీద మాత్రమే దృష్టిపెడితే వీలుకాదని జగన్ కు అర్ధమైంది. అందుకనే ప్రతిపక్షం బలంగా ఉన్న  నియోజకవర్గాలపైన కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా ఉందికాబట్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేస్తోందన్న విషయాన్ని జగన్ గ్రహించారు. అలాంటివారిని గుర్తించి వైసీపీలోకి చేర్చుకునేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. మరి జగన్ ప్లాన్ ఎప్పటినుండి మొదలవుతుంది ? ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.





మరింత సమాచారం తెలుసుకోండి: