ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు సంక్షేమంలో మునిగితేలుతున్నారు అని చెప్పాలి. సీఎం జగన్ కూడా ఎన్నికలకు ముందు మానిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను సాధ్యం అయినంతవరకు నెరవేరుస్తూ తన పాలనను కొనసాగిస్తున్నాడు. జగన్ ముఖ్యంగా విద్య , వైద్యం మరియు వ్యవసాయం విషయంలో చాలా సీరియస్ గా పధకాలను అమలు చేస్తూ ప్రజల గుండెల్లో మరో వైఎస్సార్ లాగా ముద్ర వేయించుకున్నాడు. వైఎస్ జగన్ పాలన గురించి దేశంలోని పలు రాష్ట్రాలు చర్చించుకునేలాగా, తాను తీసుకువచ్చిన పధకాలను వారు కూడా స్ఫూర్తిగా తీసుకునేలా చేసి సీఎంగా సక్సె అయ్యాడు.

ఈరోజు ఉదయం సీఎం క్యాంపు కార్యలయంలో సీఎం జగన్ ను ఉత్తరప్రదేశ్ సీఎం సలహాదారు సాకేత్ మిశ్ర కలుసుకోవడం జరిగింది. వీరిద్దరి మధ్య ఏపీలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ పధకాల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సాకేత్ మిశ్రా సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈయన మాట్లాడుతూ ఏపీలో పరిపాలన అద్భుతంగా ఉందన్నారు, రాష్ట్రంలో అమలవుతున్న విద్య , వైద్యం మరియు వ్యవసాయానికి చెందిన అన్ని పధకాలను తీక్షణంగా పరిశీలించాను... ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయిందని ఆయన జగన్ ను కొనియాడారు. ముఖ్యంగా వైద్యం మరియు సచివాలయ వ్యవస్థలలో భారీ మార్పులు వచ్చాయని ఏపీలో పాలనాతీరును మెచ్చుకున్నారు.

ఈ సచివాలయ వ్యవస్థ వలన గతంలో లాగా చిన్న పని జరగాలన్నా పట్టణాలకు వెళ్లే పనిలేదని... సచివాలయంలో ఉన్న సిబ్బంది ఇంటికి వచ్చి మరీ ప్రతి సమస్యను తీర్చి వెళుతున్నారని ఆనందంగా సాకేత్ మిశ్రా పంచుకున్నారు.
జగన్ తీసుకువచ్చిన పథకాలు అన్ని రాష్ట్రాలను మెప్పిస్తున్నాయన్నారు. ఇంతకు ముందు చాలా సార్లు బయట రాష్ట్రాల ఎవరు ఏపీ పాలన మరియు పధకాలను పొగిడారు. మరి ఈ విషయాన్ని ఏపీ ప్రజలు గమనించి వచ్చే ఎలక్షన్ లో జగన్ ను మళ్ళీ సీఎం చేస్తారా లేదా అన్నది చూడాలి.    

 


మరింత సమాచారం తెలుసుకోండి: