
బీహార్ రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పే విషయంలో ఇక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉపయోగమే లేదు అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దించుతామని స్పష్టం చేశారు. దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయని పోలీసులు ఏకంగా ప్రజలపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను కూడా ప్రయోగిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. నితీష్ కుమార్ అధికార దాహంతోనే రాష్ట్రీయ జనతా దళ్ తో పొత్తు కుదురుచుకున్నారు అంటూ ఆరోపించారు అమిత్ షా. ఈ మహా కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా తాము ఓడిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి కావాలని నితీష్ కుమార్ ఇప్పటినుంచే కలలు కంటున్నారు అంటూ వ్యాఖ్యానించాడు అమిత్ షా. అది కేవలం కలగానే మిగిలిపోతుందని ఎప్పటికీ సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ ఈ దేశానికి మూడోసారి వరుసగా ప్రధాన మంత్రి అవుతారని చెప్పుకొచ్చారూ. ఇక కాబోయే ప్రధాని ఎవరు అన్న విషయాన్ని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు అంటూ తెలిపాడు అమిత్ షా. బీహార్ లోక్సభ నియోజకవర్గాల్లో కమలం వికసిస్తుందని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్డీఏలో చేరుతామని నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ నాయకులు తమకు సంకేతాలు పంపిస్తున్నట్లు అమిత్ షా చెప్పుకొచ్చాడు.