
అయితే నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, తదితర టీడీపీ నేతలు ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే వివిధ టీడీపీ నేతలు ఉన్నా కూడా. అక్కడ బుచ్చయ్య చౌదరి, ఇతర సీనియర్ టీడీపీ నాయకులు ఉన్నా కూడా కేవలం లోకేశ్ క్యాంపు అని పేరును క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇలా ప్రతి చోట ఎల్లో మీడియా అనుకున్నది ప్రజల మెదళ్లలోకి ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.
చంద్రబాబు అరెస్టు తర్వాత అనేక విషయాలపై జాతీయ మీడియాలో కూడా లోకేశ్ కుండ బద్ధలు కొట్టేలా మాట్లాడారని దీంతో నిజానిజలు తెలిసాయని చెబుతుంటారు. ఇలా ప్రతి విషయంలో ఆయన్ని ఆకాశానికి ఎత్తే పనిని చేస్తుంటారు. అసలు విషయాలు సమాజానికి తెలియజేయకుండా అక్కడికి వెళ్లిన ఉద్దేశాన్ని బయట పెట్టకుండా వివిధ రకాలుగా ప్రచారం చేస్తుంటారు.
అయితే చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నా కూడా ఇక్కడే అమరావతి లో ఉండి మాట్లాడినట్లు ఇక్కడి డేట్ లైన్లు పెట్టి వార్తలు రాస్తుంటారు. ప్రజలను తప్పు దోవ పట్టిస్తారు. అదే జగన్ హైదరాబాద్ లో ఉంటున్నారని ప్రచారం చేసిన ఎల్లో మీడియా చంద్రబాబు విషయంలో మాత్రం నిజాలను దాస్తూ ప్రచారం చేస్తుంటుంది.