
చంద్రబాబునాయుడు దంపతులు సోమవారం దీక్ష చేయబోతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు, జైలుబయట రాజమండ్రిలోనే భువనేశ్వరి ఒక్కరోజు నిరసన దీక్షచేయబోతున్నారు. తనను అక్రమంగా కేసులో ఇరికించి జైలులో ఉంచినందుకు నిరసనగా చంద్రబాబు సోమవారం అంటే గాంధీజయంతిరోజున ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్ష చేయబోతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా భువనేశ్వరి కూడా దీక్ష చేయాలని డిసైడ్ అయ్యారు.
దీళ్ళిద్దర దీక్షలు చేస్తున్నారు కాబట్టి తమ్ముళ్ళు కూడా వివిధ ప్రాంతాల్లో దీక్షలకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు, కుటుంబసభ్యులు, తమ్ముళ్ళు, మద్దతుదారులు, ఎల్లోమీడియా వ్యవహారం దేశంలోనే విచిత్రంగా ఉంది. ఇలాంటి విచిత్రం దేశంమొత్తంమీద మరే రాష్ట్రంలోను కనబడదేమో. ఎలాగంటే స్కిల్ స్కామ్ లో అరెస్టయి కోర్టు రిమాండ్ విధిస్తే చంద్రబాబు జైలులో ఉన్నారు. చంద్రబాబును రిమాండుకు పంపటానికి అన్నీ సాక్ష్యాలు ఉన్నాయని నమ్మిన తర్వాతే కోర్టు తీర్పిచ్చింది.
తన అరెస్టు అక్రమం అని, రిమాండు అన్యాయమని, అరెస్టు తీరు దుర్మార్గమని, అరెస్టులో ప్రొసీజర్ ఫాలో అవలేదని చంద్రబాబు లాయర్లు హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేస్తే దాన్ని హైకోర్టు డిస్మిస్ చేసేసింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు, కుటుంబసభ్యులు, తమ్ముళ్ళు, ఎల్లోమీడియా తప్పుపడుతున్నారు. ఉమ్మడిరాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిచేసిన చంద్రబాబును జైలులో పెట్టడం ఏమిటని విచిత్రమైన ప్రశ్నలు లేవదీస్తున్నారు. అభివృద్ధిచేస్తే అవినీతి కేసులో చంద్రబాబును జైలులో పెట్టకూడదా ?
ఆదేశాలు చంద్రబాబుకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి కోర్టులను కూడా తప్పుపడుతున్నారు. ఇవే కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినపుడు, తీర్పులిచ్చినపుడు ఇదే చంద్రబాబు, తమ్ముళ్ళు, మద్దతుదారులు, ఎల్లోమీడియా ఆహా ఓహో అన్నారు. అప్పుడు మాత్రం కోర్టులు నిష్పక్షపాతంగా తీర్పులిచ్చినట్లు. అవే కోర్టులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆదేశాలిస్తే మాత్రం తప్పుడు ఆదేశాలిస్తున్నట్లు లెక్కట. లేకపోతే అవినీతి కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న వాళ్ళు ఎవరైనా జైలులో దీక్ష చేస్తారా ? సదరు వ్యక్తికి మద్దతుగా రాష్ట్రంలో దీక్షలు చేస్తారా ?