
గడచిన నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ పెద్దఎత్తున పోరాటాలు చేస్తోందని చంద్రబాబునాయుడు, లోకేష్ తో సహా సీనియర్ తమ్ముళ్ళందరు ఒకటే ఊదరగొడుతుంటారు. అయితే తమ్ముళ్ళు చేస్తున్న పోరాటాలు ఏమిటో ఇపుడు అందరికీ అర్ధమైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే మంత్రి రోజాపై మాజీమంత్రి విశాఖపట్నం జిల్లా సీనియర్ తమ్ముడు బండారు సత్యనారాయణమూర్తి మీడియా సమావేశంలో నోటికొచ్చినట్లు తిట్టేశారు. రోజాను ఉద్దేశించి బూతులు మాట్లాడేశారు.
మంత్రిని బండారు తిట్టడంపై మహిళా కమీషన్ తీవ్రంగా స్పందించింది. బండారుపై కేసు పెట్టి అరెస్టుచేయమని ఆదేశించింది. దాంతో పోలీసులు బండారును అరెస్టుచేయటానికి ఆయనింటికి వెళ్ళారు. దాంతో టీడీపీ నేతలు, క్యాడర్ కు ఇంటిదగ్గర పోలీసులకు పెద్ద గొడవే అయ్యింది. ఇంటి బయట అంత గొడవ జరుగుతున్న సమయంలోనే సడెన్ గా బండారుకు తీవ్ర అనారోగ్యం వచ్చేసింది. అర్జంటుగా మాజీమంత్రిని ఆసుపత్రిలో చేర్చాలంటు కుటుంబసభ్యులు పెద్ద గోలచేశారు.
ఇక్కడ అందరికీ అర్ధమవుతున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులును తమ్ముళ్ళు నోటికొచ్చినట్లు తిట్టేసి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆసుపత్రుల్లో జాయిన్ అయిపోతున్నారు. అరెస్టు తప్పదంటే వెంటనే కోర్టులో పిటీషన్ వేసి ముందస్తు బెయిల్ తెచ్చేసుకుంటున్నారు. ఖర్మంకాలి అరెస్టయితే వెంటనే బెయిల్ రడీగా ఉంటుంది. ఇంతకీ జగన్ ప్రభుత్వంపై తమ్ముళ్ళు చేస్తున్న పోరాటాలు ఏమిటి ? ఎక్కడంటే మీడియాలో జగన్+మంత్రులను అమ్మనాబూతులు తిట్టేయటమే.
ఇపుడు బండారును అరెస్టు చేయటానికి పోలీసులు ఇంటికి రాగానే మరో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పెద్దఎత్తున నేతలు, క్యాడర్ పోలీసులను అడ్డుకుని ఇంట్లోకి వెళ్ళకుండా గొడవలు పడటమే ఆశ్చర్యంగా ఉంది. కొన్ని గంటల పాటు గొడవ జరిగిన తర్వాత మొత్తానికి రాత్రి బండారును పోలీసులు అరెస్టు చేసి వియవాడ తీసుకొచ్చారు. జగన్, మంత్రులను తిట్టడం ఎందుకు ? పోలీసులు వస్తే తప్పించుకుని పారిపోవటమో లేదో ఆసుపత్రిలో జాయిన్ అవటం, లేదంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం ఎందుకు ? ముందస్తు బెయిల్, బెయిల్ అన్నది ఒకపుడు సాధ్యమయ్యిందేమో కానీ ఇకముందు అంత ఈజీకాదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బెయిల్, ముందస్తు బెయిల్ చంద్రబాబునాయుడుకే సాధ్యంకాక రాజమండ్రి జైలులో నానా అవస్తలు పడుతున్నారు. అలాంటిది తమ్ముళ్ళు ఒకలెక్కా ?