ఎవరైనా తమని టార్గెట్ చేస్తే తమని దోషిగా చూపిస్తే అవతలి వాళ్లపై కూడా ఏదో ఒక నింద వెయ్యాలని చూస్తుంటారు కొంతమంది. రాజకీయాల్లో అయితే ఈ తత్వం మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆ మధ్య చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అవడం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారం అరెస్టు చేయించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు అనుకోవడం కూడా అందరికీ తెలిసిన విషయమే.


అయితే దీనికి బదులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈమధ్య జగన్మోహన్ రెడ్డిని గట్టిగా టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అరబిందో క్రెడింట్  ట్రెమ్ ఫార్మా లో జగన్మోహన్ రెడ్డికి 49% వాటా ఉందని వీళ్లు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా లక్షతో ప్రారంభమైన ఇండో సోల్ సోలార్ కు 76 వేల కోట్ల ప్రాజెక్టులు రావడం ఇవన్నీ,గమనిస్తే జగన్ కు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు.


ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలు ఈ విషయాన్ని హైలైట్ చేసుకుంటూ చెప్పుకొస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు విన్న వాళ్లు, తెలిసిన వాళ్ళు కొంత మంది ఇది సంబంధం లేని ఆరోపణ అని అంటున్నారట ఒక పక్క. అయితే ఇదే నిజమైతే సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు వేయొచ్చు. సిబిఐకి కూడా ఈ స్కాం విషయంలో సజెస్ట్ చేయొచ్చు.  కానీ ఇదంతా ఎందుకని అంటే చంద్రబాబు నాయుడుని ఇప్పుడు అవినీతిపరుడు అని వాళ్ళు నిరూపిస్తున్నారు కాబట్టి.


వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పై ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది అంటున్న మాట. సిమెన్ సంస్థ, డిజైన్ టెక్ సంస్థ అలానే స్కిల్లర్ అనే సంస్థ ఇవన్నీ బోగస్ కంపెనీలే. అయితే వీటిని బడా కంపెనీలుగా చూపిస్తూ అరబిందో లాంటి బడా కంపెనీని తక్కువ చేసి చూపిస్తున్నారు వీళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: