హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి జనాలను బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు. అధికార పార్టీ తరపున హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి పోటీచేస్తున్నారు. కౌశిక్ బ్లాక్ మెయిలింగ్ పై ఎన్నికల కమీషన్ సీరియస్ అయ్యింది. అభ్యర్ధి వ్యాఖ్యలపై విచారణ చేయిస్తోంది.  ఇక్కడ బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ పోటీచేస్తుంటే కాంగ్రెస్ తరపున ఒడితల ప్రణవ్ పోటీలో ఉన్నారు. దాదాపు రెండునెలల ప్రచారంలో కౌశిక్ ఏమిచేశారో అర్ధంకావటంలేదు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కేసీయార్ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే ప్రత్యర్ధి పార్టీల్లోని మిగిలిన అభ్యర్ధులకన్నా కౌశిక్ బాగా ముందే ప్రచారంలోకి దిగేశారు.

అలాంటిది ప్రచారం చివరిరోజు అంటే 28వ తేదీన నియోజకవర్గంలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు తనను గెలిపించకపోతే 4వ తేదీన తమ శవయాత్రను చూడాల్సుంటుందని ప్రకటించారు. పెద్ద వెహికల్లో ఒక వైపు భార్య, మరోవైపు కూతురితో ర్యాలీ చేసిన రెడ్డి జనాలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు జనాలు కచ్చితంగా ఓట్లేసి గెలిపించకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటమే ఆశ్చర్యంగా ఉంది. 3వ తేదీ ఫలితాల తర్వాత 4వ తేదీ విజయయాత్రా లేకపోతే తమ శవయాత్రా అన్నది తేలిపోతుందని భార్య, కూతురును చూపిస్తు కౌశిక్ బెదిరించారు.

కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ జనాలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటం చాలా విచిత్రంగా ఉంది. నిజానికి ఇలాంటి బెదిరింపులు, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగులు ఎన్నికల కమీషన్ నిబంధనలకు విరుద్ధం. కౌశిక ర్యాలీలో బహిరంగంగా అదికూడా మైకులో మాట్లాడుతు చేసిన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఎన్నికల కమీషన్ పరిశీలకుల దృష్టికి రాలేదా అన్నదే ఆశ్చర్యంగా ఉంది.

నిజంగానే ఎన్నికల కమీషన్ నిబంధనలను గట్టిగా అమలుచేస్తేంట కౌశిక్ మీద బ్యాన్ విధించాలి.  ఎన్నికల్లో కౌశిక్  గెలుస్తాడా లేదా అన్నది వేరే సంగతి. కానీ గెలవటానికి అనుసరించిన విధానం, చేసిన ప్రయత్నం ఆమోదయోగ్యం కాదు.  తనను గెలిపించకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ బెదిరించారంటేనే తన గెలుపు ఎంత కష్టంగా ఉందో అర్ధమైపోతోంది.  గెలవరని తెలిసిపోయినపుడే కదా అభ్యర్ధులు ఇంతటి చీప్ ట్రిక్స్ కు దిగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: