గడచిన మూడురోజులు కేసీయార్ ప్రత్యేక వ్యూహం అమలుచేశారట. అదేమిటంటే ఎన్నికల మంత్రాంగమంతా నలుగురు నేతల కేంద్రంగానే కేసీయార్ వ్యూహాలు పన్నారట. ఇంతకీ విషయం ఏమిటంటే కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ లో బీజేపీ నేత ఈటల రాజేందర్, ఖమ్మం, పాలేరులో కాంగ్రెస్ నేతలు తమ్ముల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి ఓటమికి  కేసీయార్ ప్రత్యేకంగా టార్గెట్ పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. రేవంత్ రెండు నియోజకవర్గాలు కామారెడ్డి, కొడంగల్ లో పోటీచేస్తున్న  విషయం తెలిసిందే.

కామారెడ్డిలో తన గెలుపు ఖాయం కాబట్టి కొడంగల్ లో తప్పకుండా ఓడించాలని గట్టిగా డిసైడ్ అయ్యారట. అలాగే గజ్వేలుతో పాటు హూజూరాబాద్ లో కూడా ఈటల పోటీచేస్తున్నారు. గజ్వేలులో తన గెలుపు ఖాయమే కాబట్టి మిగిలిన హుజూరాబాద్ లో కూడా ఈటలను ఎలాగైనా నా ఓడించాలన్నది కేసీయార్ పట్టుదలట. అయితే కామారెడ్డిలో గెలుపు కేసీయార్ అనుకుంటున్నంత ఈజీ కాదని సమాచారం. ఇక్కడ కేసీయార్, రేవంత్ తో పాటు బీజేపీ అభ్యర్ధి వెంకటరమణారెడ్డి బలంగా ఉన్నారట.

కామారెడ్డిలో లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ బాగా వచ్చేసిందని క్షేత్రస్ధాయి సమాచారం. రమణారెడ్డి లోకల్ అయితే కేసీయార్, రేవంత్ ఇద్దరు నాన్ లోకల్ అని జనాల్లో బలమైన ఫీలింగ్ పెరిగిపోయిందట. పైగా రమణారెడ్డి ఆర్ధికంగా కూడా బాగా గట్టి స్ధితిలోనే ఉన్నారట.  ఐదేళ్ళ నుండి నియోజకవర్గంలో వ్యక్తిగతంగా  మ్యానిఫెస్టోను ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి అదృష్టం కలిసొస్తే రమణారెడ్డి గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదనే టాక్ బాగా పెరిగిపోయింది.

ఇక ఖమ్మం, పాలేరులో తుమ్మల, పొంగులేటి ఓటమిని కేసీయార్ వ్యక్తిగతంగా సీరియస్ గా తీసుకున్నారు. ఒకపుడు వీళ్ళిద్దరికి కేసీయార్ ఎంతటి సన్నిహితుడో ఇపుడంతటి ప్రత్యర్ధిగా మారిపోయారు. అందుకనే వీళ్ళని ఎలాగైనా గెలవనీయకుండా చూడాలని పట్టుదలగా ఉన్నారట. అందుకనే వీళ్ళ నలుగురిపైన కేసీయార్ ప్రత్యేక వ్యూహాలను అమలుచేసినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. అయితే కేసీయార్ వ్యూహాలు ఏ మేరకు సానుకూలమయ్యాయి అన్నది సస్పెన్సుగా మారింది. ఎందుకంటే తమ గెలుపుపై వీళ్ళందా చాలా ధీమాగా ఉన్నారు కాబట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: