ఎన్నికల వచ్చాయి అంటే చాలు హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ఎన్నికల సమయంలో జరిగే కొన్ని చిత్ర విచిత్రమైన ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఏదో ఒకటి చేసి గెలవాలి అనుకునే ఎంతో మంది అభ్యర్థులు డబ్బు మద్యం పంచడానికి కూడా వెనకాడరు. ఈ క్రమంలోనే వీధివీధిలో ధనలక్ష్మి నాట్యం చేస్తుంది. మద్యం ఏరులై పారుతూ ఉంటుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే నేటి రోజుల్లో ఎలక్షన్స్ వచ్చాయి అంటే ఇలా భారీగా డబ్బులు పంచకుండా మద్యం పంచకుండా గెలిచినవారు చాలా తక్కువ మంది ఉంటారు.


 ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఒక ధనవంతుడైన అభ్యర్థిని మరో ధనవంతుడే ఓడించడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఓడించడం అంటే అది ఎంతటి ప్రత్యర్థి కైనా కష్టం. కానీ ఇక్కడ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేనూ ఏకంగా ఒక రోజు వారి కూలి ఓలించాడు. చత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది జరిగింది. అక్కడ కాంగ్రెస్ పాలనకు ప్రజలు గుడ్ బై చెప్పేసారూ. బిజెపి అఖండమైన మెజారిటీ సాధించింది.


 అయితే ఈ ఎన్నికల ఫలితాలలో ఒక అనూహ్యమైన ఘటన జరిగింది. ఏకంగా రోజువారి కూలీ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాడు. ఈశ్వర్ సాహు రోజువారి కూలి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈశ్వర్ కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు సాహు కుమారుడిపై మూకుమ్మడిగా  దాడి చేసే హత్య చేశారు. అయితే ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిరుస్తుంది అని బిజెపి ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈ విషయంలో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది   ఏకంగా సాహుని సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రవీంద్ర చౌదరి పోటీలో నిలబడ్డారు. గతంలో ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా బిజెపి వ్యూహం ఫలించింది. ఏకంగా రోజువారి కూలి ఏడుసార్లు ఎమ్మెల్యే అయినా రవీంద్ర చౌదరి పై 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: