ఎల్లోమీడియాలో పచ్చరోగం అదే పచ్చకామెర్లు బాగా ముదిరిపోతున్నట్లుంది. ఎందుకంటే తాను అనుకున్నట్లే జనాలంతా అనుకుంటున్నారని, తాను అనుకున్నదే జనాలంతా అనుకోవాలనే రోగం బాగా పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఎల్లోమీడియా యాజమాన్యంలో నిలువెల్లా విషం నిండిపోయింది. చంద్రబాబునాయుడు అంటే అపారమైన ప్రేమ ఒకవైపు జగన్ అంటే ధ్వేషం మరోవైపు పెరిగిపోతుండటమే ఎల్లోమీడియా అసలు సమస్య.
దీనికి సాక్ష్యం ఏమిటంటే ఆదివారం రాసిన చెత్తపలుకే. అందులో ఏముందంటే జగన్ పాలనపైన జనాలంతా తీవ్రంగా వ్యతిరేకంగా తయారైపోయారట. అలాగే పార్టీలోని నేతలు కూడా జగన్ అంటే తీవ్రస్ధాయిలో మండిపోతున్నారట. కాకపోతే ఎన్నికలకు ఇంకా సమయం ఉందికాబట్టి ఎవరు బయటపడటంలేదట. ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా ? ఎప్పుడెప్పుడు జగన్ను దింపేద్దామా అని జనాలంతా ఎదురు చూస్తున్నట్లు అచ్చేసింది. నిజానికి జగన్ ఓడిపోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రవ్వాలని ఎల్లోమీడియాకు బలమైన కోరికుంది. తనలోని కోరికే జనాలందరిలోను ఉందనే భ్రమల్లో ముణిగిపోతోంది.
చంద్రబాబంటే ఎల్లోమీడియాకున్న అపారమైన ప్రేమ, సంబంధాలు మిగిలిన జనాలకు ఎందుకుంటుందన్న కనీస ఆలోచన కనబడటంలేదు. ఎంతసేపు జగన్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో జగన్ ఓడిపోవటం ఖాయమని ఒకటికి వందసార్లు అనుకుంటున్నది యాజమాన్యం. చేతులారా జగన్ అన్నీ వర్గాలను దూరం చేసుకున్నారు కాబట్టి గెలుపు కష్టమే అంటు సూత్రీకరించేసింది. ఏ వర్గాన్ని జగన్ దూరంచేసుకున్నారో మాత్రం చెప్పదు. కారణం ఏమిటంటే వివరంగా విశ్లేషిస్తే చెత్తపలుకులోని డొల్లతనం బయటపడిపోతుంది కాబట్టి.
వైఎస్ షర్మిల గనుక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే జగన్ పనైపోయిందని అచ్చేశారు. కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల తీసుకుంటే జగన్ పని ఎలాగైపోతుందో ఎల్లోమీడియా యాజమాన్యానికే తెలియాలి. వైసీపీ అసంతృప్తులు చేరితే కాంగ్రెస్ ఓట్లు పెరుగుతుందని చెప్పటంలో తప్పులేదు. జగన్ ఓటమిఖాయమని తాను అనుకున్నట్లే జనాలంతా అనుకోవాలని, చంద్రబాబు సీఎం అవ్వాలన్న తన కోరికను జనాలు తీర్చాలని యాజమాన్యం అనుకుంటుండటమే అసలు సమస్య. అందుకనే ఎల్లోమీడియాకు పచ్చరోగం ముదిరిపోయిందని అంటున్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి