ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు సైతం పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అటు తెలంగాణలో ఇటు ఏపీలో కూడా చాలా మంది సెలబ్రిటీలు తమ తమ రాజకీయాలలో ఉనికిని చాటు కునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కూడా రాజకీయాలలో ఉన్నారు. ఈ మధ్యనే కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మరి కొంతమంది రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారు ఇప్పుడు స్టార్ కమెడియన్గా తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించిన ప్రముఖ హాస్యనటులలో ఒకరైన కమెడియన్ సప్తగిరి రాజకీయాలలోకి రాబోతున్నట్లు తెలియజేశారు.


తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో సప్తగిరి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా తాను పోటీ చేయబోతున్నానంటూ తెలియజేశారు. త్వరలోనే టిడిపిలోకి చేరుతానంటూ కూడా తెలియజేయడం జరిగింది. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధంగానే ఉన్నారంటే తెలియజేశారు. తాను రాయలసీమలో పుట్టానని చంద్రబాబు గారి అభివృద్ధి చేసే పెరిగానంటూ తెలియజేశారు. టిడిపి అధికారంలోకి రావడానికి చాలా కృషి చేస్తానంటూ కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి తరఫున ప్రచారం కూడా చేపడతానంటూ ఇటీవలే తెలియజేశారు.


కేవలం పేదలకు సహాయం చేయడానికి రాజకీయాలలోకి వస్తున్నానని పార్టీ పెద్దలు ఎలాంటి చిన్న అవకాశం ఇచ్చిన కచ్చితంగా తప్పకుండా వాటిని నిర్వహిస్తూ ముందుకు వెళ్తారని తెలిపారు గతంలో ఇవ్వగలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని కలిశానని.. అందుకే ఈసారి కూడా టిడిపి తరఫున ఎన్నికలలో నిలబడతానంటే స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన సినిమాలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాజకీయాలలో ఉంటూనే నటిస్తూ ఉంటానని చెప్పారు సప్తగిరి. అయితే ఈ విషయం విన్న ఆయన అభిమానులు సైతం చేజేతులారా రాజకీయాలలోకి వచ్చి కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారు సప్తగిరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు సప్తగిరికి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: