వచ్చే ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనడానికి అటు టిడిపి పార్టీ బిజెపి , జనసేన పార్టీ కూటమిలో భాగంగా పోటీ చేయబోతున్నారు.. దీంతో టిడిపి పార్టీలోని సీనియర్ల పైన పొత్తు తీవ్రమైన ప్రభావం చూపుతోంది.. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయత గా ఉన్నటువంటి చాలామంది నేతల మధ్య అసంతృప్తులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో చాలామంది సీనియర్ నేతలు టికెట్లు కూడా కోల్పోవడం జరిగింది. అలా టిడిపి,  జనసేన పలువురు నాయకులు , మాజీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిని వెల్లడిస్తూ ఉన్నారు. కొంతమంది ఏకంగా పార్టీలకే గుడ్ బై చెప్పేస్తున్నారు.

అందులో భాగంగానే కొంతమంది వైసిపి పార్టీని వీడితే మరి కొంతమంది  వైసీపీ పార్టీలోకి చేరుతూ ఉన్నారు.. ఈ మధ్యకాలంలో టిడిపి పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వలసలు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా అన్నమయ్య రాయచోటి జిల్లాకు చెందిన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు రెడ్డెప్ప గారి రమేష్ రెడ్డి కూడా చేరారు.. అలాగే ఈ రోజున జనసేన పార్టీ సీనియర్ నేత పోతిన మహేష్ కూడా వైసీపీలోకి చేరారు. అలాగే జనసేనకు చెందిన సీనియర్ నాయకురాలు పాముల రాజేశ్వరి కూడా వైయస్సార్ పార్టీలోకి చేరారు.


ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేత లోక్సభ సభ్యుడు నిమ్మల కిట్టప్ప కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరారు.సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లాకు చెందిన నిమ్మలకిట్టప్పకు ఈసారి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించలేదు చంద్రబాబు.. హిందూపురం లోక్సభ స్థానం  టికెట్ ఆశించినప్పటికీ మాజీ ఎమ్మెల్యే బి కె పార్థసారధికి కేటాయించారు. అలాగే అసెంబ్లీ టికెట్ కూడా రాకపోవడంతో పుట్టపర్తి నుంచి టికెట్ ఆశించిన అక్కడ టికెట్ పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూర రెడ్డికి ఇచ్చారు. ఇటీవల నిర్మల కిట్టప్ప కూడా టిడిపి పార్టీకి రాజీనామా చేయడంతో.. వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు దుద్దుకుంట్ల శ్రీధర్ రెడ్డి ,కేతిరెడ్డి పెద్దారెడ్డి నిమ్మల కిట్టప్పతో సంప్రదింపులు జరిపారు. దీంతో ఆయన వైసిపి పార్టీలోకి వెళ్లడానికి అంగీకరించారు. త్వరలోనే జగన్ సమక్షంలో వైసిపి పార్టీలోకి చేరబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: