ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగర మోగింది. అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల ప్రచారాలు జోరు అందుకున్నాయి మరోవైపు సర్వేలు ప్రజల అభిప్రాయాలను సేకరించి ఎవరు గెలుస్తారో తెలుపుతున్నాయి. తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూపు ఒక సర్వే చేపట్టింది. వైసీపీ 120 నుంచి 130 మధ్య అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. టీడీపీ పార్టీ 45 నుంచి 55 నియోజకవర్గాల్లో గెలవచ్చని ఈ పోల్ అంచనా వేసింది.

సర్వే ప్రకారం, లోక్‌సభలో 19 నుంచి 21 స్థానాలు వైసీపీ గెలిస్తే.. టీడీపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు గెలవచ్చు. జెండర్ వైస్ గా చూసుకుంటే 45% పురుషులు 55% మహిళలు వైసీపీకి ఓటు వేస్తారు. అలానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 47 శాతం మంది పురుషులు, 40 శాతం మంది మహిళలు ఓటు వేస్తారు. టోటల్ గా చూసుకుంటే వైసీపీకి 52 శాతం టీడీపీకి 44 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. చాలా సర్వేలు వైసిపి పార్టీ గెలుస్తుందని అంచనా వేసాయి. ఈ పోల్ సర్వే కూడా సేమ్ అవే రిజల్ట్స్ వెల్లడించింది. వైసీపీ పాలన పట్ల ఏపీ ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని కూడా స్పష్టంగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) విజయం సాధించడం ఖాయమని ఇటీవలి సర్వేలన్నీ చెబుతున్నాయని, దీంతో బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 10 వేర్వేరు సర్వేల్లో 9 వైసీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. లగడపాటి రాజగోపాల్ సోదరుడు మధు చేసిన సర్వేలో కూడా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని తేలింది.

ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న మాజీ రాజకీయ నాయకుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గెలుపుపై ఆయన తప్పుగా అంచనా వేయగా, ఆయన సోదరుడు జగన్ గెలుపుపై సరిగ్గానే పందెం కాశారు. రాజగోపాల్ గతంలో చేసిన తప్పుల దృష్ట్యా ప్రస్తుతం అంచనాలు వేయడం లేదు. అదనంగా, ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించిన సర్వేలో బిజెపిని కలిగి ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ఆంధ్రప్రదేశ్‌లో మంచి పనితీరు కనబరచడం లేదని, బిజెపి అభ్యర్థి పురంధేశ్వరి కూడా గెలుపొందడం లేదని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: