తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే అటు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మెజారిటీ స్థానాలలో విజయం సాధించడం కోసం పావులు కదుపుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తికాగా ఇక ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు.


 ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుంది అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇక అటు సికింద్రాబాద్ స్థానంపై మూడు పార్టీలు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాయి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి గత రెండు దఫాలుగా కిషన్ రెడ్డి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇక మూడోసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికై హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నారు. మరోవైపు ఇక బిజెపిని దెబ్బ కొట్టి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో తమ పార్టీ జెండా ఎగర వేయడమే లక్ష్యంగా మిగతా పార్టీలు ఫోకస్ చేశాయి.


 అయితే కిషన్ రెడ్డి మాత్రమే కాదు మిగతా పార్టీల నుంచి బరిలోకి దిగిన నేతలు కూడా సీనియర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత హస్తం గూటికి చేరి ఇక ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నాయకులు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలలో బిఆర్ఎస్ గెలిచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన మద్దతుతో ఇక పార్లమెంట్ స్థానంలో గెలవాలని బీఆర్ఎస్ అనుకుంటుంది. అయితే సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ హస్తం పార్టీ జెండాను ఎగరవేయాలని అనుకుంటుంది. ఈ ముగ్గురు సీనియర్లలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp