హైదరాబాద్ అంటే హైటెక్ సిటీనో మరేదో కాదు. అసలు సిసలైన పాతబస్తీతో కూడిన ప్రాంతం. ఈ లోక్ సభ స్థానం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇందులో మజ్లిస్ పార్టీ కొన్ని దశాబ్ధాలుగా తన జెండా ఎగురవేస్తూ వస్తోంది. ఇది లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం.


ముఖ్యంగా దేశంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా.. మూసీ నది ఆవల వైపు దక్షిణాన ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానంలో 40 ఏళ్ల నుంచి ఎంఐఎం పార్టీ తిష్ఠ వేసుకొని కూర్చొంది. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి కంచుకోట. ఎంఎంఐం అధినేత అసదుద్దీన్ 2004 నుంచి ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి గెలుపు అంత సులభంగా దక్కే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.


ఇక్కడ బీజేపీ తమ అభ్యర్థిగా మాధవీ లతను ఎంపిక చేసింది. అప్పటి నుంచి ఆమె పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతూ వస్తోంది. హైదరాబాద్ లోక్ సభ స్థానంలో పది సార్లు గెలిచిన ఎంఐఎం అక్కడి ప్రజలకు ఏం చేయలేదనే వాదనతో ఆమె రంగంలోకి దిగింది. ముఖ్యంగా అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ .. అధికారంలోకి వస్తే ఏం చెస్తానో చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.


మరోవైపు ఎంఐఎం ఆమెపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు భతర నాట్యం చేస్తున్న వీడియోలపై అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. కానీ ఆమె ట్రిపుల్ తలాక్ చట్టాల గురించి ప్రచారం చేస్తూ.. కొంతమంది ముస్లిం మహిళలను తమ వైపునకు తిప్పుకుంటుంది. మరోవైపు ఇక్కడ ఆమె గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా ముస్లిం ఓటు బ్యాంకుతో పాటు సంప్రదాయ హిందూ ఓటర్లు ఆమెకు అనుకూలంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ సారి అసదుద్దీన్ కి గెలుపు అంత సులభంగా దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆమె ప్రచారంతో అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: