తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయింది అనే స్టేజ్ నుంచి తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాత చరిష్మాను మళ్ళీ తీసుకువచ్చాడు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధిష్టానాన్ని సర్ ప్రైజ్ చేసిన రేవంత్ ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ప్రతి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే మెజారిటీ స్థానాలలో విజయం సాధించి ఇక కాంగ్రెస్ అధిష్టానానికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు రేవంత్.


 పార్టీలోని కీలక నేతలందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఒక నియోజకవర్గంలో విజయం మాత్రం రేవంత్ కు మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అదే రేవంత్ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదంటే రేవంత్ కు కొంత డ్యామేజ్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 2019 లోక్సభ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎంగా ఉండి కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోకపోతే అది రేవంత్ ఇమేజ్ ని డామేజ్ చేయడం ఖాయమని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక్కడ బిజెపి నుంచి ఈటెల బిఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి లాంటి బలమైన అభ్యర్థులు పోటీలో నిలిచారు.


 ఇక కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఈ లోకసభ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలలో కూడా బిఆర్ఎస్ పార్టీనే విజయ డంక మోగించింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్కు బలమే లేకుండా పోయింది. ఇంకోవైపు బిజెపి కూడా మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగరేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన రేవంత్ తన ఇమేజ్ కు డామేజ్ కాకుండా మల్కాజ్గిరిలో విజయం లక్ష్యంగా వ్యూహాలను అమలు చేయడంలో మునిగిపోయారట. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడం.. ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఏం జరుగుతుంది అన్నది ఓటర్ల డిసైడ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: