టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో వరుసగా బిగ్గెస్ట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు..స్టార్ హీరోల అందరితోనూ దిల్ రాజు సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.ప్రస్తుతం దిల్ రాజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో గేమ్ చేంజర్ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.అలాగే మరిన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ను దిల్ రాజు లైన్ లో పెట్టారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్స్ దాఖలు చేసి ప్రచారం లో దూసుకుపోతున్నారు..

ఇదిలా ఉంటే తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి తన మద్దతు ప్రకటించారు. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ మేరకు దిల్ రాజు ఓ వీడియోను కూడా విడుదల చేశారు.బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదుసార్లు ఒంగోలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు.ఆరవసారి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా నిలబడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలలో మంత్రిగా బాధ్యతలు నెరవేర్చారు.ఒంగోలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేత కు ఓటు వేసి గెలిపించండి... అంటూ ఆ వీడియో లో దిల్ రాజు అభ్యర్థించారు.ఆయన మాట్లాడుతూ బాలినేని రాజకీయ ప్రస్థానం పై ఒక డాక్యుమెంటరీ రూపొందించాను. అది అందరూ కూడా చూడాలని దిల్ రాజు వెల్లడించారు. . బాలినేని శ్రీనివాసరెడ్డి ని కలిసిన దిల్ రాజు ఆయనను గొప్ప నేత గా అభివర్ణించారు.ప్రస్తుతం దిల్ రాజు వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: