ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో 6 రోజులలో ఆంధ్రప్రదేశ్ లో  సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.. ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ నేత జగన్ జోరుగా ప్రచారం చేస్తున్నారు.. అలాగే కూటమి నేతలు కూడా ఈ సారి జగన్ వస్తే జరిగే నష్టం గురించి వివరిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన ఎన్డియే సంకీర్ణ కూటమి బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా చేసిన ప్రసంగం ప్రస్తుతం వైరల్ అవుతుంది.రాష్ట్రంలో కూటమి తరఫున తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి అమిత్ షా వచ్చారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.అయితే అమిత్ షా ప్రసంగం మాత్రం భిన్నంగా సాగింది. టీడీపీ- జేఎస్‌పీ ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 గురించి ప్రస్తావించడానికి కూడా ఆయన ఇష్ట పడలేదు. దీనితో టీడీపీ పార్టీలో కలవరం మొదలయింది.

సూపర్ 6 మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉండటం చర్చనీయ అంశంగా మారింది. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సంయుక్త మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరైన బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా అంతగా ఇష్టపడలేదనే విషయం తెలిసిందే.కూటమి ప్రకటించిన పధకాల అమలు సాధ్యం కాదని.అందులో పొందుపరిచిన హామీలన్నీ కూడా అమలుకు వీలు కాదనే కారణంతోనే  బీజేపీ నేత సిద్దార్థ్ నాథ్ సింగ్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి దీన్ని ఆవిష్కరించడానికి ముందుకు రాలేదు.. పైగా చంద్రబాబు ప్రసంగించడానికి ముందే ఆయన సభ నుంచి వెళ్లిపోవడం ప్రాధాన్యత చోటు చేసుకుంది.

కేంద్రం తరఫున ఏపీకి ఎలాంటి నిర్థిష్ట హామీలను అమిత్ షా ఇవ్వలేదు. ఈ విషయంలో ఆయన విఫలం అయ్యారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. అమిత్ షా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు.రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న బకాయిల గురించీ కూడా చెప్పలేదు.అలాగే అమిత్ షా గానీ చంద్రబాబు గానీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అంశాన్నీ ఈ సభ దృష్టికి తీసుకుని రాలేదు. నాలుగు శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తామంటూ వారిద్దరూ భరోసాను ఇవ్వలేకపోయారు. దాని స్థానంలో రామమందిరం అంశాన్ని ప్రస్తావించడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తు చేస్తోన్నారు. వైఎస్ జగన్‌పై అమిత్ షా నేరుగా ఎలాంటి విమర్శలు కూడా చేయలేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. చాలా వరకు ఆయనను విమర్శించడానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని తెలిపారు.జాతీయ స్థాయి అంశాల విషయంలో మాత్రమే వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారని వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: