ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా రెండు కూటములు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఒకవైపు హ్యాట్రిక్ కొట్టాలని ఎన్డీఏ కూటమి ప్రత్యేకమైన వ్యూహాలతో ముందుకు సాగుతుంటే.. ఇంకోవైపు ఇక ఈసారైనా కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి అనుకుంటుంది. ఈ క్రమంలోనే కూటమిలోనే అన్ని పార్టీలను కలుపుకుంటూ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతు.. ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు ఇక సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పాలి.


 తమను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై ఇక్కడ స్పష్టమైన హామీలు ఇస్తూ ఓటర్లలో  తమ పార్టీపై నమ్మకాన్ని కలిగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూన్నాయ్  పార్టీలు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇలా పార్లమెంట్ ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో  కొన్ని చోట్ల మాత్రం చిత్ర విచిత్ర కరమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయ్ అని చెప్పాలి. సాధారణంగా ఏ పార్టీ ప్రచార నిర్వహించినా ఇక తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలి అంటూ అభ్యర్థించడం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇక తమ అభ్యర్థికి కాదు ఏకంగా నోటా కి ఓటు వేయాలి అంటూ ప్రచారం చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే ఇలా చెప్పడం వెనక కారణం కూడా లేకపోలేదు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఇలా కాంగ్రెస్ వినూత్నంగా ప్రచారం చేస్తుంది. తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో నోటాకు ఓటెయ్యాలని ప్రచారానికి దిగింది. కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి చివరి క్షణాల్లో నామినేషన్ ఉపసంహరించుకుని.. బిజెపిలో చేరాడు. దీంతో కాంగ్రెస్ ఇక పోటీలో లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  నోటా కి ఓటు వేసి బిజెపికి ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్పాలి అంటూ కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: