సాధారణంగా ఏదైనా ప్రాంతంలో బాగా ఘర్షణలు జరిగినప్పుడు, ఓటు వేయడానికి సామాన్య ప్రజలు ఇబ్బంది పడినప్పుడు అక్కడ రీపోలింగ్ తప్పనిసరిగా పెడతారు. అయితే మాచర్ల నియోజకవర్గంలో దాడులు బాగానే జరిగాయి. ఒకరికొకరు చంపుకునేటట్లు పోట్లాడుకుంటుంటే ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు మీడియా, పేపర్లలో స్పష్టంగా కనిపించాయి. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో గొడవల వల్ల ప్రజలు పోలింగ్ బూత్ నుంచి దూరంగా పారిపోతున్నట్టు చూపించే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీళ్ళందరూ ఓటు వేయడానికి వచ్చిన వాళ్లే ఓటు వేయకుండానే వారి పారిపోయారు.

 అలాంటప్పుడు రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాత్రం మరోసారి పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్యపు సమాధానాన్ని వినిపిస్తోంది. ఏపీలో మే 13 పోలింగ్ తేదీన మొత్తం 106 సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింసాత్మక ఘటనలు జరిగిన ప్రతి చోటా రీపోలింగ్ కండక్ట్ చేయాలని రాజకీయ విశ్లేషకులు అందరూ కోరుతున్నారు. అయితే ఇక్కడ ఒక రూల్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే గొడవ జరిగిన చోట ప్రజలు ఓటు వేయలేకపోయారు పోలింగ్ లేదా పోలింగ్ బూత్ ఏజెంట్ తెలియజేయాల్సి ఉంటుంది.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పోలింగ్ బూత్ లో ఉన్న టీడీపీ ఏజెంట్ రీపోలింగ్ నిర్వహించాలని ఎలాంటి సూచన సలహా లేదా ఫిర్యాదు చేయలేదు. ఆరుగురు వైసీపీ పోలింగ్ బూత్ ఏజెంట్లను తన్ని తరిమేసి టీడీపీ వాళ్లు అరాచకాలకు పాల్పడ్డారు. అయితే అక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాలని రాసి ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళు రాసి ఇవ్వలేని పక్షంలో పోలింగ్ ఆఫీసర్లు రీపోలింగ్ చేయాలంటూ ఒక విజ్ఞప్తిని రాసి ఇవ్వాలి. వాళ్లు కూడా ఆ పని చేయలేదు. వీళ్ళ కారణంగా మొత్తం మీద చాలామంది ఓటు వేయలేకపోయారు. మరి వాళ్ల సంగతేంటి అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకం.

మరింత సమాచారం తెలుసుకోండి: