ప్రముఖ సినీనటి రోజా రాజకీయంలో అడుగుపెట్టి అక్కడ కూడా బాగా సక్సెస్ అయ్యారు. పోయినసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగరి నుంచి పోటీ చేసే విజయం సాధించారు. నిజానికి ఆమెకు గెలుపు అనేది నల్లేరు మీద నడక లాంటిది. అదేంటి అని ప్రశ్నిస్తే నగరిలో ఆమెకు బలమైన ప్రత్యర్థి అంటూ ఎవరూ లేరు. ఈసారి ఆమెపై గెలిచేందుకు టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ రంగంలోకి దిగారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుమారుడైన భాను ప్రకాష్ రాజకీయాలకు చాలా కొత్త. ఆయనకు ఈ నియోజకవర్గంలో పెద్దగా ప్రజాదరణ లేదు.

రోజా 2022, ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ పర్యాటకం, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2004లో టీడీపీ అభ్యర్థిగా నగరి నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 2009 అదే పార్టీ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి కాంటెస్ట్ చేశారు. అప్పుడు కూడా ఓడిపోయారు తర్వాత వైసిపిలో చేరారు 2014లో నగరి నియోజకవర్గ నుంచి ముద్దుకృష్ణమనాయుడు పై పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఆయనను ఓడించే విజయ బావుటా ఎగరవేశారు. 2019లో ఆయన కుమారుడు భాను ప్రకాష్ పై పోటీ చేసే 2708 ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు మళ్లీ ఆయన పైన విజయం సాధించారు. రెండుసార్లు వరుసగా గెలవడం వల్ల ఆమెపై ఐరన్ లైగ్‌ అని ఉన్న ముద్ర చెరిగిపోయింది. ఆమెకు గోల్డెన్ లైగ్‌ అనే బిరుదు కూడా వచ్చింది.

రాజ్యసభ లాంటి పదవులను అందిస్తామని చెప్పిన ఆమె మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటానని కష్టపడ్డారు. చాలా కష్టం పోరాటం చేస్తూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచే తన సత్తా చాటారు. వైసీపీలో చేరాక పెద్దిరెడ్డి రోజాను అణగదొక్కారు అయితే ఆమె చాలా ఓపికతో ఆయన ఆప్యాయతను పొందగలిగారు. ఆయన ఆశీస్సులను పొంది పార్టీలో ఎదగగలిగారు. సొంత పార్టీలో వ్యతిరేకం చేసిన వారిని కూడా ఆమె ఈజీగా ఫేస్ చేయగలిగారు.

ఇక నగరి నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం మంచిగానే నడుచుకుంది. ఎలాంటి వివాదాలకు పోకుండా జాగ్రత్త పడింది. అయితే ఎమ్మెల్యేలు కింద ఉన్నవారు కొంచెం పెత్తనం చెలాయించడం ఏదో ఒక దందా లాంటిది కొనసాగించడం జరుగుతుంటుంది రోజా విషయంలో కూడా అదే జరిగింది. గాలి ఫ్యామిలీకి నగరి నియోజకవర్గంలో అసలు ఎలాంటి సింపతి లేదు. వారికి ఓటు వేసే ఆసక్తి కూడా ప్రజల్లో కనిపించదు. కానీ రోజాపై పార్టీలోనే చిచ్చు ఏర్పడటం, ఇంకా రోజా భర్త, సోదరులు పెత్తనాలు చెలాయించడం వల్ల ఆమె ఓటమి ఖాయం అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: