ఐఏఎస్ అధికారిణి యర్రా శ్రీలక్ష్మి వైఎస్ఆర్ కాలం నుంచి తెలుగు వారికి సుపరిచితురాలు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆమె ప్రమేయం ఉందని ఆరోపిస్తూ 2011లో ఆమెను అరెస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసులో అరెస్టు అయ్యారు. అయితే, తెలంగాణ హైకోర్టు ఆ తర్వాత ఆమెను అన్ని అభియోగాల నుంచి క్లియర్ చేసింది. ఆమె నిరపరాధిగా బయటికి వచ్చిన తర్వాత మళ్లీ ఐఏఎస్ గా కొనసాగారు.తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చినా, అరెస్టు చేసినా వైఎస్ కుటుంబం మాత్రం ఆమెను విశ్వసిస్తూనే ఉంది.  అరెస్టు తర్వాత కూడా వైఎస్ జగన్‌ శ్రీలక్ష్మిని తిరిగి అడ్మినిస్ట్రేటివ్ పోసిషన్ లో నియమించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఆమెను ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

2024 ఎన్నికలలో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. దాంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈరోజు ఐఏఎస్ అధికారులతో జరిగిన సదస్సులో శ్రీలక్ష్మి చంద్రబాబును పలకరించేందుకు ప్రయత్నించారు. ఆమె పూల బొకేతో అతనిని సంప్రదించగా, బాబు దానిని అంగీకరించలేదు. సింపుల్ గా బొకే వైపు కూడా చూడకుండా వెళ్లిపోయారు.

బాబు తన ఫ్లవర్ బొకే తిరస్కరించినప్పుడు శ్రీలక్ష్మి నిరుత్సాహంగా చూసారు. ఆ దృశ్యాలను మీడియా సభ్యులు చాలా ప్రత్యేకంగా హైలెట్ చేశారు. గత 5 సంవత్సరాలలో అనేక మంది ఐఏఎస్ అధికారులు పనిచేసిన తీరు పట్ల తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ సమావేశంలో బాబు బలమైన ప్రసంగం చేశారు. ఆ తర్వాత శ్రీలక్ష్మికి అవమానం జరిగింది. వైసీపీ మనిషి అని భావించారు కాబట్టే ఆమె బొకేను బాబు తీసుకోలేదు.

ఇకపోతే గడిచిన 5 ఏళ్లలో వైసీపీకి కొమ్ము కాస్తూ జగన్ కు తొత్తులుగా పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేశారు వారు చేసిన అక్రమాలను అవకతవకలను గుర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ చర్యల నుంచి తప్పించుకోవాలని అందరూ ఐపీఎస్ అధికారులు ఏపీకి వెలుపల ట్రాన్స్‌ఫర్లు చేయించుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారట కానీ వారి బదిలీలను టీడీపీ ప్రభుత్వం తిరస్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ias