పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. ఈ క్రమంలోనే పెళ్లి విషయంలో యువతీ యువకులిద్దరూ కూడా కోటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి. తమకు నచ్చిన భాగస్వామి జీవితంలోకి వస్తే కలకాలం సంతోషంగా ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకునే సమయంలో వెనక ముందు అన్ని ఆలోచించుకుని ముందడుగు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఇక నూతన వధూవరులు ఇద్దరు ఇద్దరి మధ్య ఒక విషయంపై చర్చ వస్తూనే ఉంటుంది. అదే మెట్టినీంటికి వచ్చిన తర్వాత భర్త ఇంటి పేరును తన ఇంటిపేరుగా మార్చుకోవాలా వద్దా అని. ఈ మధ్యకాలంలో ఎంతో మంది  సెలబ్రిటీలు ఇక పెళ్లయిన తర్వాత భర్త ఇంటి పేరుని తమ ఇంటి పేరుగా మార్చుకుంటుంటే.. కొంతమంది మాత్రం పుట్టింటి పేరునే కొనసాగిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాm.  అయితే ఇలా పెళ్లయిన తర్వాత అటు భర్త ఇంటి పేరును భార్య తన ఇంటిపేరుగా మార్చుకోవాలంటే.. ఎవరిదైనా పర్మిషన్ తీసుకోవాలా వద్దా అనే విషయంపై కూడా చాలామందికి అనుమానాలు ఉంటాయి.


 అయితే ఈ విషయంపై ఇటీవలే కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాత మెట్టినింటికి వెళ్ళిన వివాహితలు తమ ఇంటి పేరును మార్చుకోవాలి అంటే భర్త నుంచి ఎన్ఓసి తప్పనిసరి అంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల పేరు మార్పు ప్రక్రియలో ప్రభుత్వం చేసిన పలు మార్పులను సవాల్ చేస్తూ 40 ఏళ్ల మహిళా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ చేసింది. అయితే ఈ అంశం ఇటీవల రాజ్యసభలో ప్రస్తావనకు రాగా.. ఇలా భార్యా ఇంటి పేరును తీసేసి భర్త ఇంటి పేరును మార్చుకునేందుకు తప్పనిసరిగా భర్త నుంచి పర్మిషన్ అవసరం అన్న నిబంధన ద్వారా చట్టపరమైన సమస్యలను నివారించవచ్చు అంటూ అభిప్రాయపడింది కేంద్రం. అయితే ఇక హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ పై  ఆగస్టు ఏడవ తేదీన మళ్లీ విచారణ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: