
మల్లాం గ్రామంలో అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది పెద్దమనుషులు ఎస్సీ వర్గానికి చెందిన వారిని వెలివేసినట్లు వినిపిస్తున్నాయి. నియోజవర్గం శివారిలో ఉండేటువంటి మల్లాం గ్రామంలో ఎక్కువగా అగ్రవర్ణాల వారే ఉన్నారు.అయితే గత రెండు రోజుల క్రిందట దళిత వర్గానికి చెందినటువంటి సురేష్ అనే వ్యక్తి కరెంటు పని కోసం వచ్చి ఒక ఇంట్లో కరెంటు షాక్ తో మరణించారట. ఆ వెంటనే గ్రామ పెద్దలు సైతం జోగ్యం చేసుకొని ఇంటి యజమానిని ఆర్థికంగా సొమ్ములు ఇవ్వాలని డిమాండ్ చేశారట.
దీంతో ఎటువంటి కేసులు లేకుండా సురేష్ అంతక్రియలు పూర్తి చేశారు. అయితే అంతా అయిపోయిన తర్వాత ఇస్తామన్న 2.7 లక్షల రూపాయలు ఆ ఇంటి యజమాని తిరస్కరించారట. దీంతో ఆగ్రహం చెందిన సురేష్ కుటుంబ సభ్యులు ఇతర దళిత సంఘాల వర్గాల నాయకులతో కలిసి ఆ ఇంటి యజమాని ముందు ధర్నా చేశారు. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని అక్కడ అగ్రవర్ణాలలోని వారంతా కూడా మల్లాం గ్రామంలో ఉండే దళితులకు ఎలాంటివి అమ్మకూడదని ఏ షాపులలో వస్తువులు ఇవ్వకూడదని కండిషన్ పెట్టారట. దీంతో అక్కడ దళితులకు అక్కడ టీ నుంచి టిఫిన్ ల వరకు ఏవి ఇవ్వలేదట. దీంతో అక్కడ దళితులు ఆవేదనని తెలియజేస్తున్నారు. ఈ విషయం వైరల్ గా మారడంతో అక్కడ సిఐ అధికారులతో పాటు ఆర్డీవో కూడా పర్యటించారు. అయితే సర్ది చెప్పే ప్రక్రియలో కూడా శ్రీకారం చుడుతున్నారని సమాచారం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లోని ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడంతో పవన్ కి రాబోయే రోజుల్లో ఇది తలనొప్పిగా మారే అవకాశం ఉన్నది