ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో తాజాగా కీలకమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అధికార కూటమి ప్రభుత్వం నుంచి చాలామంది నేతలు ఒక్కొక్కరిగా సస్పెండ్ అవుతూ ఉన్నారు. తాజాగా టిడిపి మహిళా నేత ఒకరు సస్పెండ్ అయినట్లుగా తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ మహిళా నేత సంది రెడ్డి గాయత్రి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా టిడిపి అధిష్టానం నుంచి ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మహిళ నేత  తెలుగు రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నది. అయితే సోషల్ మీడియాలో పలు రకాల ఆరోపణలు రావడంతో పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపణలు రావడంతో సందిరెడ్డి పైన సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది.



ఈ మేరకు టిడిపి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పార్టీ కార్యదర్శి అశోక్ బాబు ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. సంది రెడ్డి గాయత్రీపైన వస్తున్న ఆరోపణల రిత్య పార్టీ నుండి సస్పెండ్ చేశామంటూ తెలియజేశారు. అయితే గాయత్రి సస్పెండ్ తో ఒక్కసారిగా టిడిపి పార్టీలో కళకళాన్ని రేపేలా చేస్తోంది. విజయవాడ టిడిపిలో గత కొన్నేళ్లుగా గాయత్రి పనిచేస్తూనే ఉంది. గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికారి ప్రతినిధిగా కూడా ఉన్నది..


వైసీపీ హయాంలో వైసిపి నేతలు, కార్యకర్తల పైన విమర్శలు కూడా చేసి పార్టీ దృష్టిలో పడిన గాయత్రి టిడిపి పార్టీలో చాలా కీలకంగా మారింది. గాయత్రీ తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వీడియోల ద్వారా వైరల్ గా చేస్తూ పలు రకాల టీవీ డెబిట్ కార్యక్రమాలలో కూడా పాల్గొనేది. అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వల్ల ఈమెకు పేరు కూడా బాగానే లభించింది. కానీ ఇప్పుడు సంధి రెడ్డి సోషల్ మీడియా కారణంగా సస్పెండ్ కావడంతో ఏపీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారుతున్నది. ఈ మహిళా నేత పైన వ్యతిరేకంగా పలువురు టిడిపి నేతలు కూడా పార్టీలో కంప్లైంట్ చేశారట.. అందువల్లే ఈమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి .కానీ ఇప్పటివరకు గాయత్రి ఏ విధంగా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: