
ఇంతకీ ప్రధాన మోడీ ఏపీకి ఇచ్చిన గ్యారెంటీ ఏమిటి ఐదు కోట్ల ఆంధ్రుల కలలను ఏ విధంగా సహకారం చేసేందుకు సహాయపడుతున్నారు అన్నది చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణాన్ని మనం అందరూ కలిసి చేయాలి.. ఏపీలో ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం కనుక కూటమి గా ఏర్పడి పూర్తిగా చేయాలని ఉద్దేశంతో మోడీ తెలిపారు. కేంద్రంలో కూడా బీజేపీ ఉన్నది దీంతో రాజధానికి సంబంధించి ఎలాంటి అడ్డు కూడా రాకుండా ఉండేలా మోదీ సహాయపడతారు అనే విధంగా ఈ మాటలను అర్థం చేసుకోవచ్చునీ రాజకీయ నాయకులు తెలుపుతున్నారు.
ఇక రాజధాని నిర్మాణానికి సైతం కావలసిన నిధులు ఇవ్వడానికి కేంద్ర సిద్ధంగానే ఉన్నదని.. ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కార్ ఉండడంతో రాజధాని పనులు చక చక నిర్మించుకోవాలని సీఎం చంద్రబాబు కూడా ప్లాన్ చేస్తున్నారు. 2019లో జగన్ సీఎం అవ్వడం వల్ల అమరావతి ఒక్కటే కాకుండా మూడు రాజధానులు అనే పేరుతో బ్రేక్ వేశారు. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మళ్లీ ఇన్నాళ్లు రాజధాని లేని రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏపీకి రాజధాని అమరావతి అన్నట్టుగా ఖరారు అయిపోయింది. అయితే ఈ రాజధాని పూర్తి చేయడమే ఇప్పుడు సవాళ్లుగా మారింది.
సుమారుగా అమరావతి 77,250 కోట్లకు అంచనా వేస్తున్నారు.. ఈ క్రమంలోనే 49 వేల కోట్ల పనులను ఇప్పటికే టెండర్ల ద్వారా ప్రకటించారట. అలాగే అమరావతికి రైలు సౌకర్యం కూడా ఇచ్చేందుకు రైల్వే బోర్డు అంగీకరించిందట. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం 190 కిలోమీటర్లు వేయబోతున్నారు. దీనిని కేంద్రమే భరించేలా ముందుకొచ్చిందట.
ఇలా మొత్తం కేంద్ర సహాయంతో అమరావతి నిర్మాణ పనులను పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారట కూటమి ప్రభుత్వం.