అయితే ఈ పథకం కింద అటవీ భూముల పైన హక్కు కలిగిన వారిని అర్హులుగా గుర్తించబోతున్నారు.. అలాగే వ్యవసాయ, ఉద్యాన, పట్టు వారితో పాటుగా తహసిల్దార్, మర్దళ వ్యవసాయ అధికారులతో తమ పరిధిలో ఉండే రైతులకు సంబంధించి అన్ని వివరాలను కూడా పరిశీలించాలంటూ ఏపీ ప్రభుత్వం కోరింది.అలాగే ధ్రువీకరించిన అర్హుల జాబితాలను కూడా ఈ నెల 20వ తేదీ వరకు అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో ఉంచేలా ప్రభుత్వం తెలియజేసింది. భర్త భార్య పిల్లలతో కూడిన కుటుంబం ఉండేలా ఉండాలట.
అలాగే పిల్లలకు వివాహమైతే వారికి ప్రత్యేకమైన యూనిట్ గా పరిగణించబోతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంట సాగులకు కూడా ఈ పథకాన్ని అందించేలా చేయబోతున్నారట. ఆర్థికంగా ఉన్నత స్థానాలలో ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదట. గతంలో రాజ్యాంగబద్ధ పదవులు ఇప్పుడు నిర్వహించేవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదట. అలాగే న్యాయవాదులు, ఇంజనీరింగ్, వైద్య ,చార్టెడ్అకౌంట్, ఆర్కిటెక్లు ఇతరత్రా వృత్తి నిపుణులు కూడా అర్హులు కాదని తెలుపుతున్నారు. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు కూడా ఈ పథకానికి అనర్హులు అంటే తెలియజేశారు. త్వరలోనే అన్ని నిబంధనలతో పాటు అర్హతలకు సంబంధించి విషయాలను తెలియజేస్తామంటూ తెలుపుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి