
భారత బలగాలు మొత్తం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా చేసిన దాడులు సక్సెస్ అయ్యాయి.
భారతదేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన జైషే ఈ ముహమ్మద్ - లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థల అగ్ర నాయకత్వమే టార్గెట్ గా భారత్ ఆర్మీ గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు చేసింది. మోడీ ప్రత్యక్షంగా ఈ ఆపరేషన్ పర్యవేక్షించడంతో భారత బలగాలు మరింత ఉత్తేజంతో ఆపరేషన్ సక్సెస్ చేశాయి. ఉగ్రదాడులను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, పహల్గాం దాడికి అంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటామని తాజా ఎటాక్‌తో మనోళ్లు చెప్పకనే చెప్పేశారు.
అయితే తాము పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదు అని.. పీవోకే లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని .. భారత్ పై దాడులకు ఎక్కడ నుంచి ప్లాన్ చేశామో .. అదే స్థావరాల సైన్యం పై దాడి చేసినట్టు భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన తెలిపింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు