
ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు చిర్రెత్తుకొచ్చింది. స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు. తన పేరు చెప్పి గత 20 రోజుల నుంచి కొందరు కిందిస్థాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఇష్టమైన ప్లేస్‌కు బదిలీ చేయిస్తామని.. ప్రమోషన్లు ఇప్పిస్తామంటూ.. ఎమ్మెల్యే కార్యాలయంలో పనులు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేయించిన వైనం ఎమ్మెల్యే బాలరాజు దృష్టికి వచ్చింది. అలాగే జూదం, కోడిపందాల పేరుతో కూడా కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చట్ట వ్యతిరేక పనులకు పర్మిషన్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తే సొంత పార్టీ నాయకులను అయినా క్షమించేది లేదని బాలరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల నుంచి తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొందరు నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు తనకు అందాయని... ఇందుకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారని... తన పేరు చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడితే అధికారులు సైతం సస్పెండ్‌కు గురవుతారని బాలరాజు హెచ్చరించారు. తన లక్ష్యం పోలవరం నియోజకవర్గ అభివృద్ధే అన్నారు. ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 89789 89476 వాట్సాప్ నెంబర్‌కు ఇలాంటి అవినీతి అక్రమాలకు సంబంధించి, ప్రజా సమస్యల గురించి సమాచారం అందించవచ్చన్నారు. అలాగే మండల స్థాయిలో కూడా ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేస్తానన్నారు. ఏదేమైనా తనపై వచ్చే ఫిర్యాదులు.. తన పేరు వాడుకుని తప్పు పనులు చేసే వారికోసం ఇలా టోల్ ఫ్రీ వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేగా జనసేన ఎమ్మెల్యే చిర్రి నిలిచారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు