భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా దాడి చేయాలనే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజున ఇరుదేశాల మధ్య చర్చలు జరపబోతున్నారని ఈ క్రమంలోనే బలూచ్  లిపరేషన్ ఆర్మీ (BLA) ఒక సంచలన ప్రకటన చేసింది. భారత్ కు మద్దతు ఇస్తామంటూ ప్రకటించడమే కాకుండా పాకిస్తాన్ పైన దాడి చేయాలని విజ్ఞప్తి కూడా చేశారు. పచ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తామసిద్దంగానే ఉన్నామంటూ తెలియజేశారు.


పాకిస్తాన్ పైన భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ పైన దాడి చేస్తామని. భారత్ చేసే ఎలాంటి చర్యకైనా తాము స్వాగతిస్తామని తెలియజేశారు. భారత్ కు సైనిక శక్తిగా నిలుస్తామంటు ఒక సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ కోరారు BLA అయితే గత కొన్నేళ్లుగా  పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న BLA ఆర్మీ భారత్ నుంచి కూడా సహాయం కోరుతూ నిన్నటి రోజున ఒక లేఖను కూడా రాసిందట.

భారత్, పాకిస్తాన్ పైన దాడి చేయాలని కోరారు. భారతదేశం ఒక అడుగు వేస్తే పశ్చిమ దేశాల నుంచి దానిని నాశనం చేయడానికి తాము సిద్ధంగానే ఉన్నామంటూ తెలియజేశారు BLA ఆర్మీ. పాకిస్తాన్ శాంతి కాల్పుల విరమణ అంటూ తప్పుడు ప్రకటనలతో ప్రచారం చేస్తూ మభ్య పెట్టాలని చేస్తోందంటూ తెలియజేశారు. పాకిస్తాన్ మాటలకు బలైపోవద్దంటూ తెలియజేసింది బిఎల్ఎ ఆర్మీ. పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రపంచ ఉగ్రవాదిగా కేంద్రంగా పనిచేస్తుందంటూ తెలియజేశారు.

ఎలాంటి  మద్దతు లేకుండానే బలిచిస్తాన్ గడ్డపైన పాకిస్తాన్ వంటి వాటితో పోరాడామని ఎన్నో రంగాలలో ఓడించామంటూ BLA ఆర్మీ ప్రకటించింది.. పాకిస్తాన్ ని మూలాల నుంచి నిర్మూలించాలని.. భారతదేశం తమకు రాజకీయ దౌత్య సైనికంగా కూడా మద్దతు ఇవ్వాలంటూ కోరడం జరిగింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: