
దీంతో ఆయన మృతదేహాన్ని బళ్లారిలోనే తన ఇంటికి తరలించినట్లు సమాచారం. దరూర్ పుల్లయ్య సొంత ఊరు అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఛాయాపురం లో జన్మించారు. అయితే ఈయన చదువు మద్రాసులో పూర్తి అయిన తర్వాత ఉరవకొండ పంచాయితీ ప్రెసిడెంట్ గా 1968 నుంచి 78 వరకు చేశారు. అనంతరం 1977,1980 ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయన ఎంపీగా ఉన్నన్నినాళ్లు తన నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, దానధర్మాలు చేసిన దదురు పుల్లయ్య మరణంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులతో పాటు తన సొంత ఊరి ప్రజలు శోకసముద్రంతో మునిగిపోయారు.
పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈయన ఆత్మకు శాంతి చేకూరాలంటు తెలియజేస్తున్నారు. దదూరు పుల్లయ్య పార్థివ దేహాన్ని బళ్లారిలో తమ ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. ఇక ఈయన భార్య సత్యవతి కాగా ఈయనకు ఆరుగురు కుమార్తెలు ,కుమారుడు కూడా ఉన్నారు. ఈనెల 14వ తేదీన ఈయన అంత్యక్రియలు జరపబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీంతో ఆయన మృతికి పలువురు సీనియర్ నేతలతో పాటు, ప్రస్తుత రాజకీయ నేతలు కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.