మందుబాబులకు తాజాగా గుడ్ న్యూస్ రాబోతోంది.. భారత్, బ్రిటన్ మధ్యకు కుదిరినటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో తాజాగా బీర్ల ధరలు కూడా తగ్గబోతున్నాయట. కనీసం ఒక బ్రాండ్ నుంచి 25 నుంచి 35 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందట. అయితే ఈ తగ్గింపు కొన్ని బ్రాండ్లకు మాత్రమే ఉంటుందంటూ ఎక్స్చేంజ్ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ వేసవికాలంలో బీర్ల అమ్మకాలు కూడా మరింత పెరిగిపోయాయని రెండు తెలుగు రాష్ట్రాలలో కెఎఫ్ బీర్ల కొరత కూడా ఏర్పడిందట.


గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది ఆదాయం కూడా పెరిగింది అంటూ పలువురు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కేఎఫ్ బీర్ల పైన ఇప్పటికి 30 రూపాయలు పెరగడంతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అధికారులు మరొక గుడ్ న్యూస్ ని తెలియజేశారు. బ్రిటన్ భారత్ మధ్య జరిగిన ఒప్పందంతో బ్రిటన్ బీర్స్ పైన పన్ను ఏకంగా 75% వరకు తగ్గించిందట. దీంతో ఒక్కో బీరు పైన 35 రూపాయల వరకు తగ్గబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 200 రూపాయలు ఉన్న బ్రిటన్ బీర్..165 నుంచి 175 రూపాయలకే లభిస్తుందట.


2024లో భారతీయ బీర్ల మార్కెట్ విలువ 50 వేల కోట్ల రూపాయలు ఉండగా ప్రతి ఏడాది కూడా సగటు 8 నుంచి 10% వరకు పెరుగుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మద్యం అమ్మకాలు రోజురోజుకి మించి మరి కొనసాగుతున్నాయట. తాజాగా ఎక్సైజ్ శాఖ కూడా కొత్త ప్రతిపాదనలను సైతం తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తోంది. అలాగే కర్ణాటక తరహాలో ట్రెట్రా ప్యాకెట్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.60 ml,90 ml,180 ml ప్యాకెట్లను తయారు చేసి అమ్మడానికి కూడా పలు రకాల కంపెనీలు సిద్ధంగా ఉన్నాయట. సీసాలతో పోలిస్తే ప్యాకెట్ల ద్వారా చాలా తక్కువగా ఉంటుందని ఎక్సేంజ్ శాఖ కూడా వీటి వైపే మక్కువ చూపుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: