తాడిపత్రి టిడిపి సీనియర్ నేత మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా ఏ విధంగా మాట్లాడినా కూడా అవి సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఏడాది అయిన కూటమి ప్రభుత్వం కావస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలు రావడంలేదని ప్రజలు తిడుతున్నారని.. వచ్చే ఎన్నికలలో గెలవడం కూడా చాలా కష్టంగానే మారిందంటూ తెలుపుతున్నారు. ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా గెలవడం కష్టమే అంటూ తెలుపుతున్నారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ప్రతిరోజు తాడిపత్రిలో తాను పర్యటిస్తున్నానని ఎక్కువమంది ప్రభుత్వ పథకాలే రాలేదంటూ మమ్మల్ని తిడుతున్నారన్నట్టుగా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి , ఫీజు రిమెంబర్స్, రైతు భరోసా మహిళలకు ఇలా ఏవో ఒక రూపంలో డబ్బులు జేబులో ఉండేవి.. ఇప్పుడు డబ్బులు అందించకపోవడంతో నాయకులను ప్రజలు డైరెక్ట్ గానే తిడుతున్నారంటూ జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు..  చాలా కష్టపడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేశామని అయినా కూడా ప్రజలకు కావాల్సింది నేరుగా డబ్బులు తమ జేబులోకి పడాల్సిందే అన్నట్లుగా మాట్లాడుతున్నారని తెలిపారు మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. మా వాళ్లేమో మున్సిపాలిటీ ఎన్నికలలో 83 ఉన్నాయి 83 గెలుస్తామని చెబుతున్నారు.. నాకు తెలిసి నాది అయితే కష్టంగా ఉంటుంది అనుకుంటున్నాను అంటూ డైరెక్ట్ గానే చెప్పేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఉచిత పథకాలు జగన్  డబ్బులు వేసేవారు ఇప్పుడు వేయలేదని అడుగుతున్నారని తెలిపారు.


ఈ జనాలకి అసలు బుద్ధి లేదని తాడిపత్రి నియోజకవర్గంలో సుమారుగా 43 కిలోమీటర్ల వరకు పెన్నా నదిలో ఇసుకను ఇష్టం వచ్చినట్లుగా ఎవరంతకు  వారు తోడుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు.. అయితే ఈసారి మాత్రం ఓపెన్ గాని ఇసుకని అమ్మేస్తానంటూ తెలియజేశారు జెసి ప్రభాకర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: