
గత రెండు రోజులుగా బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు గెలవడం.. కోహ్లీ అభిమానులు అది ఒక పండగల సెలబ్రేట్ చేసుకోవడం ఐపీఎల్ ట్రోఫీని చూడడానికి ఆర్ సీబీ ని స్పెషల్గా ఎంకరేజ్ చేయడానికి వేలాది మంది జనాలు తరలి చిన్న స్వామి స్టేడియం వద్దకు వచ్చారు. అక్కడ అన్ని గేట్లు ఒకసారి ఓపెన్ చేయడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ భారీ తొక్కిసలాట కారణంగా 11 మంది మృతి చెందారు .
కర్ణాటక ప్రభుత్వం దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకుంది . గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు . కమిషనర్ సహా ఐదుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆర్ సి బి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసెల్ అరెస్ట్ అయ్యారు . ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లిన ఆయనను పోలీసులు అక్కడే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అందరు ఇతగాడిని విరాట్ కోహ్లాఇకి రైట్ హ్యాండ్ అంటుంటారు. వ్యక్తిగత పేరు కోసం సోసెల్ అనాధికారికంగా ప్రమోషన్స్ చేశారు అని అనుమతి లేకుండానే పరేడ్ నిర్వహించాలని పోలీసులు చెబుతున్నారు .
ఈ కారణంగానే ఆయనని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది . మరొకవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్ ..ట్రెజరర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది . ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానితోపాటు సీఎం సిద్ధరామయ్య డిజిపి కి కిలక ఆదేశాలు జారీ చేశారు . ఆర్సిబి డిఎన్ఏ మేనేజ్మెంట్ ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలి అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు . ఇప్పటికే ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం మీద కేసు నమోదు అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం . అంతేకాదు త్వరలోనే క్రికెటర్స్ పై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.