
ఆ తర్వాత కొన్ని సెకన్లలోనే ఎయిర్ పోర్టుకు సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్నాయని సమాచారం అందుతోంది. మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్ అని చెప్పవచ్చు. అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్నీ రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలో ఉన్న ఏటీసీకి తెలియజేయడానికి దీనిని వాడతారు. తాము ఆపదలో ఉన్నామని తమకు తక్షణ సహాయం అవసరం అని విజ్ఞప్తి చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.
ఎమర్జెన్సీ సమయాల్లో పైలెట్లు మేడే అనే పదాన్ని మూడుసార్లు చెప్పడం జరుగుతుంది. ఫ్రెంచ్ పదం ఆయన మైడెర్ నుంచి ఈ పదం పుట్టింది. సహాయం చేయండి అని ఈ పదానికి అర్థం అని చెప్పవచ్చు. విమానాలతో పాటు నౌకలలో మేడే కాల్ ను వాడటం జరుగుతుంది. ఈ విమానంలో 169 మంది భారతీయులు ఉన్నారని బోగట్టా. బిజె మెడికల్ కాలేజ్ యూజీ హాస్టల్ భవనాలపై విమానంలోని కొన్ని భాగాలూ పడ్డాయని తెలుస్తోంది.
ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయాల పాలైనట్టు సమాచారం అందుతోంది. హాస్టల్ భవనాలపై భారీ ఎత్తున మంటలు చెలరేగాయని తెలుస్తోంది. సహాయక సిబ్బంది అక్కడికి వేగంగా చేరుకోవడంతో పలువురిని సురక్షితంగా బయటకు తీశారని సమాచారం అందుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు