ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గాల పెంపుపై వార్తలు మరింత ఊపొందుకున్నాయి .. ఇక తాజాగా జనగణపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోస్టిఫికేషన్ రిలీజ్ చేయడంతో నియోజకవర్గాల పెంపు పక్క అని రాజకీయ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు .. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గల‌ పెంపు హామీ ఉన్న విషయం తెలిసింది .. అయితే జన గణన కోసం కేంద్రం ఇప్పటివరకు ఎదురుచూస్తూ వచ్చింది .. ఇక ఇప్పుడు దానిపై కూడా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో నియోజకవర్గాల పెంపు పై తెలుగు రాజకీయ పార్టీలకు గడ్డి నమ్మకం కుదిరింది .. అలాగే రెండు దశల్లో జనగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .

ఇక తొలి విడత 2026 అక్టోబర్ 1న జనాభా లెక్కింపు మొదలుకానుంది .. ఇక 2027 మార్చ్ ఒకటికి పూర్తి చేయనున్నారు .  అయితే మొదటి దశలో మంచు ఎక్కువగా ఉండే కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ , లద్దాఖ్‌ తో పాటు హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్లో ఈ జన గణన జరగనుంది. ఇక రెండో దశలో మిగిలిన రాష్ట్రాల్లో 2027 మార్చ్ ఒకటి నుంచి మొదలు పెడతారు .. అయితే రెండో జనగణతో పాటు కులగణ‌న కూడా చేపట్టనున్నారు .. ఇక ఇందుకోసం భారీ మొత్తంలో ఉద్యోగుల్ని కూడా తీసుకుంటున్నారు .. అయితే ఈ జనగణన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వ సారి జరుగుతుంది .. అంతకుముందు 8 సార్లు చేపట్టినట్టు కేంద్ర హోమ్ శాఖ తెలిపింది ..



అయితే నిజానికి 2021 లోనే జనగణన జరగాల్సి ఉండగా .. ఆ సమయంలో కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది .. ఇక చివరిగా 2011లో జనాభా లెక్కంపు జరిగింది .. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కించాల్సి ఉంటుంది .. కానీ దేశంలో కోవిడ్ మహమ్మారి విల‌య‌ తాండవం చేస్తున్న కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే .. ఇక ఇప్పుడు మళ్లీ జనాభా లెక్కింపు చేయనున్నారు .. అయితే ఈసారి దేశవ్యాప్తంగా లోక్సభ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు ఈ  జనగణన తోడ్పడునుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: