
పోలీసుల వేధింపుల వల్లే వెంకటేశ్వర రావు కొడుకు నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్ కామెంట్లు చేశారు. నాగ మల్లేశ్వరరావు భార్య, పిల్లలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని జగన్ ప్రశ్నించారు. ఇదే నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త అయిన లక్ష్మీ నారాయణపై పోలీసులు వేధింపులకు పాల్పడటంతో ఆ వ్యక్తి చావుబ్రతుకుల మధ్య ఉన్నాడని జగన్ చెప్పుకొచ్చారు.
డీఎస్పీ హనుమంతరావు తిట్టిన తిట్లను తట్టుకోలేక లక్ష్మీ నారాయణ ఆత్మహత్యాయత్నం చేసాడని జగన్ పేర్కొన్నారు. కమ్మ కులస్తులు వైసీపీలో ఉండకూడదా? కమ్మ కులస్తులు బాబుకు ఊడిగం చేయటానికి మాత్రమే పుట్టారా? అని జగన్ ప్రశ్నించారు. కమ్మ కులస్తులు అనే కారణంతో వైసీపీకి చెందిన కొంతమంది నేతలను వేధిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరని పోలీస్ అధికారులు రూల్స్ అతిక్రమించి తమ వాళ్ళను వేధిస్తున్నారని చంద్రబాబు కామెంట్లు చేశారు.
మరో మూడు నాలుగేళ్లలో తాము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆ సమయంలో ఇబ్బంది పెట్టే ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని జగన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే జగన్ నిజంగానే మళ్ళీ సీఎం అవుతారా? విమర్శించే వాళ్లకు చుక్కలు చూపిస్తారా? అనే ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాల్సి ఉంది. 2029 ఎన్నికల సమయానికి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.