
అయితే ప్రవీణ్ పుల్లట్ల తెలిపిన ట్విట్టర్ ప్రకారం కూటమి ఏడాది పాలన సందర్భంగా రైజ్ రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సర్వేలో గ్రీన్ జోన్ లో 28 కూటమి ఎమ్మెల్యేలు కేవలం 28 మందిని తెలిపారు.. అలాగే ఆరంజ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు 97 మంది అంటూ తెలిపారు.. ఇక రెడ్ జోన్ డేంజర్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు 50 మంది ఉన్నారని తెలియజేశారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తాము తెలపలేమంటూ తెలిపారు .కానీ కూటమి ప్రభుత్వం పైన ఏడాది పాలనకు ఇలాంటి రివ్యూలు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అంతేకాకుండా గతంలో టిడిపి పార్టీ గెలుస్తుందని చెప్పిన కొన్ని సర్వేలు.. కూటమి పాలన ఏడాది తర్వాత టిడిపిలో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఈసారి ఎన్నికలలో గెలిచేందుకు చాలా తక్కువ అవకాశం ఉండదని కూడా హెచ్చరించారు. సుమారుగా 40 మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు పైన కూడా ఆరా తీస్తూ ఒక్కొక్కరిని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజలలో నిరంతరం మమేకమవుతూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించడం జరిగింది.