
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రేవేంద్రపాడు ఎంపీటీసీ కొప్పుల మధుబాబు రూ.91,413 ఆర్థికసాయం అందించారు .. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు జడ్పీ హైస్కూల్ లో చదివిన గంపా ఉమామహేశ్వరి అనే విద్యార్థిని మొన్నటి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 575 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచారు .. దీంతో మండలంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనిబరిచిన వారికి మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ సాధించిన మెజార్టీతో నగదు బహుమతి అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది .. దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రూ.91,413 చెక్కును సదరు విద్యార్థినికి అందించారు. . .
ప్రభుత్వ పాఠశాలలో చదివిన తనకు అండగా నిలవడం పట్ల మంత్రి లోకేష్, టీడీపీ నేత మధుబాబు కు విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అలా లోకేష్ అందించిన ఈ చెక్ ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం లో మంచి హాట్ టాపిక్ గా మారింది. ఇక విద్యా శాఖా మంత్రి గా నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారన్న ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి. ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు