మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురుకుల హాస్టల్ మెస్ కాంట్రాక్టర్లకు ఏప్రిల్ వరకు ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేశామని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం బకాయిలను చెల్లించిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న రెంట్ బిల్డింగ్స్ లో నడుస్తున్న గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ కు సంబంధించిన బకాయిలను త్వరలో చెల్లిస్తామని చెప్పారు.

యూనిఫామ్, షూస్, బుక్స్ కోసం  త్వరలో టెండర్లు పిలిచి  విద్యార్థులకు అందజేస్తామని చెప్పుకొచ్చారు.  విద్యార్థులకు  నాణ్యమైన విద్యను  అందించడానికి  ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా  ఇంటిగ్రేటెడ్  ఇంటర్నేషనల్ స్కూల్స్ ను  తీసుకువస్తామని చెప్పుకొచ్చారు.  గత పదేళ్లుగా బి.ఆర్.ఎస్ పార్టీ మాదిరిగా  తమ ప్రభుత్వం చేయడం  లేదని కామెంట్లు చేశారు.

తమ దృష్టికి వచ్చిన వెంటనే  చర్యలు తీసుకుంటామని  రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్  స్కీమ్  ను అమలు చేయాలని చెప్పుకొచ్చారు.  ఈ స్కీమ్  లో భాగంగా  25 శాతం  సీట్లను  ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయించాల్సిందేనని చెప్పుకొచ్చారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ మాత్రమే  ఈ సీట్లు ఇస్తున్నాయని మిగతా స్కూల్స్ ఇవ్వడం లేదని  ఆయన  కామెంట్లు చేశారు.

 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటనపై నెటిజన్లు  సంతోషం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.  ప్రజలకు మేలు చేకూరేలా తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల ఎంతోమందికి ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే ఉన్నాయి.  మంత్రి ప్రకటన విషయంలో  కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్  నిర్ణయాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: