ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఎలాంటి సమావేశం పెట్టలేదు .. జనసేన ఆవిర్భావ సభలో వారిని వేదిక పైన కలవటమే తప్ప ఆడపాదడప అప్పుడప్పుడు వేరువేరుగా కలుస్తున్నారు తప్పించి  తన సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు .. ప్రధానంగా నియోజకవర్గాల్లో వారికి ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై కూడా ఎలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం ఇప్పుడు జనసేనలో తీవ్ర హాట్ టాపిక్ గా మారింది .. టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి వారికి కార్యక్రమాలు ఇస్తూ క్షేత్రస్థాయిలో యాక్టివ్ చేసుకుంటూ వెళుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం అటువైపు రావటం లేదని కొందరు నేతలు  బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు .


2024 లో జరిగిన ఎన్నికల్లో జనసేన 100% స్ట్రెయిట్ సాధించి 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను రెండు పార్లమెంట్ స్థానాల్లోని పోటీ చేసి ఘనవిజయం సాధించింది .. అయితే తర్వాత చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిలతో జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .. ప్రధానంగా కొన్నిచోట్ల వారి మాటలను అధికారులు కూడా వినటం లేదన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి .. నియోజకవర్గంలో ఉన్న నామినేట్ పదవులు కూడా జనసేన ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా టిడిపి నేతలే భర్తీ చేస్తున్నారని కూడా కొందరు మీడియా వేదికగానే విమర్శలు చేస్తున్నారు .. అలాగే ఎమ్మెల్యేల నుంచి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకుని వాటిని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరీక్షించే బాధ్యత పార్టీ అధినేతగా అది పవన్ కళ్యాణ్ పైనే ఉంటుంది ..



అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు బిజీగానే కనిపిస్తున్నారు .. తాను ఒక పార్టీ అధినేతనన్న విషయాన్ని మర్చిపోయి ఎమ్మెల్యేలతో అసలు ఆంటీ ముంటున్నట్టుగా ఉంటే  బయట జరుగుతున్న విషయాలు ఎలా తెలుస్తాయని కూడా వారు ప్రశ్నిస్తున్నారు .. కేవలం కొంతమంది ఇచ్చే ఫీడ్బ్యాక్ తోనే జనసేన పార్టీని ముందుకు వెళితే భవిష్యత్తులో రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు .. ప్రధానంగా ఎమ్మెల్యేలతో ఓ మూడు గంటల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే తీరికలేని పవన్ కళ్యాణ్ .. ఇక రాజకీయాలు ఏం చేస్తారంటూ సొంత పార్టీ నేతలే ఘాటైన విమర్శలు చేస్తున్నారు .. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు .. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలని అంటూ జనసేన నాయకులు వాపోతున్నారు .. ఇక మరి పవన్ కళ్యాణ్ తన సొంత ఎమ్మెల్యేలను  ఎప్పటికీ కరుణిస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: