ఆంధ్రప్రదేశ్లోని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి ఏపీ సర్కార్ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. శ్రావణమాసంలో గృహప్రవేశాలు చేయించేలా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఇలా నిర్మాణానికి సంబంధించి పనులను కూడా పూర్తి చేయాలి అంటూ ఇప్పటికే అధికారులకు కూడా ఉత్తర్వులను జారీ చేశారట. వచ్చే శ్రావణ మాసంలో మూడు లక్షల ఇళ్ళను సైతం పంపిణీ చేయడానికి ఏపీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకున్నది. ఇందుకోసం 300 కోట్ల రూపాయలను కూడా ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది.

అలాగే పెండింగ్లో ఉన్న బిల్లుల పనుల పైన ప్రత్యేకించి మరి దృష్టిసాదించాలని కూటమి సర్కార్ తెలియజేసింది.. ఎన్నికల సమయాలలో ఇచ్చిన హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పెద్దలకు ఇచ్చే ఇళ్ల పైన మరింత దృష్టి పెట్టాలని చూసింది. అందుకే ఇన్ని రోజులు సమయం పట్టిందని పేదలకు ఇచ్చే ఇళ్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని సంకల్పంతోనే అందుకు తగ్గట్టుగా అడుగులు వేసామని దశలవారీగా అందుకు సంబంధించి పనులను పూర్తి చేస్తామంటూ తెలిపారు.


ఇప్పటికే 2.50 లక్షల ఇల్లు కూడా పూర్తి అయ్యిందని మరొక 50 వేల ఇల్లు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయని ఇవి పూర్తి అయిన తర్వాత శ్రావణమాసంలో మొత్తం 3 లక్షల మందికి ఇళ్ల పట్టాలని ఇవ్వబోతున్నామంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇల్లు లేని ప్రతి పేదవారికి కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పాము. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు చొప్పున స్థలం ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చాము. వాటిని నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. మరి ఇందుకు సంబంధించి మరి కొద్ది రోజులలో అన్ని ప్రాంతాలలో కూడా అప్లై చేసుకుని సదుపాయం కూడా కల్పిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: