తెలంగాణ సర్కార్  కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది..ఈ నిర్ణయం అనేది  ధనిక వర్గాలకు మేలు చేసేలా కూలి పని చేసుకునే వారికి కీడు చేసేలా కనిపిస్తోంది.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి.. దీనివల్ల కూలీ పని చేసుకునే వారికి ఎలాంటి నష్టం జరుగుతుంది అనే వివరాలు చూద్దాం.. తెలంగాణలోని పలు వ్యాపార సంస్థల్లో పని చేస్తున్న చాలామంది ఉద్యోగులకు ఇదివరకు ఎనిమిది గంటల పని  సమయం ఉండేది. కానీ ఇప్పటినుంచి ఆ పని సమయం కాస్త  రెండు గంటలు పెంచి మొత్తం 10గంటలు  పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో 48 గంటలకంటే ఎక్కువ పని మించకూడదని తెలియజేసింది. 

ఒకవేళ 48 గంటలు దాటితే తప్పనిసరిగా ఓటీ పైసలు కట్టించాలని వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఒక రోజులో 6 గంటల్లో అరగంట రెస్ట్ ఇవ్వాలని, మొత్తం విశ్రాంతితో కలుపుకొని 12 గంటలకంటే ఎక్కువ పని చేయవద్దని తెలియజేసింది.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఈ ఉద్యోగస్తుల పని వేళలు సవరించినట్టు కాంగ్రెస్ సర్కార్ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఉద్యోగులు టైమింగ్స్ కు సంబంధించి  కఠినమైన రూల్స్ ఉండేవని దాంతో వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉండేదని చెప్పుకొచ్చింది.

ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ సవరణ వల్ల రెండు వర్గాలకు లాభం జరుగుతుందని  సర్కారు చెబుతోంది. ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా  మహిళల యొక్క పని వేళల్లో మార్పులు చేసింది. వీరు రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఆ విధంగానే తెలంగాణ సర్కార్ కూడా పనివేళలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచేసింది.. ఇలా పని వేళలు పెంచడం వల్ల కార్మికులపై మాత్రమే భారం పడుతుందని, వ్యాపారస్తులకు లాభం చేకూరుతుందని కొన్ని కార్మిక సంఘాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సవరణ అనేది కేవలం కార్పోరేట్ వ్యాపారం చేసే వారికి మాత్రమే మేలు చేకూరుస్తుందని ఖండిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: